రవితేజతో లిప్ లాక్ చేసినా లాభం లేకుండా పోయింది?

రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ. అయితే చిన్న సినిమాలు చేస్తూనే ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ వరుసెంట స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. 
rakul preet singh lip kiss raviteja కోసం చిత్ర ఫలితం

అయితే స్టార్ హీరోల సినిమాలైతే ఛాన్స్ దక్కించుకుంటున్న ఈ భామ ఆ సినిమాలను హిట్ బాట పట్టించడంలో మాత్రం వెనుకడుగేస్తుంది. అమ్మడి లాస్ట్ రిలీజ్ రవితేజ కిక్-2 సినిమా ఫ్లాప్ అవ్వడం దీనికి కారణం కావొచ్చు.
rakul preet singh lip kiss raviteja కోసం చిత్ర ఫలితం

 కిక్-2 సినిమాలో రవితేజతో లిప్ లాక్ చేసినా లాభం లేకుండా పోయింది. చిన్న హీరోలకు లక్కీ గాళ్ అయిన ఈ భామ పెద్ద హీరోలకు కష్టమే అనిపిస్తుంది. ప్రస్తుతం చరణ్ తో బ్రూస్ లీ సినిమాలో హాట్ హాట్ గా అందాలు ఆరబోసిన ఈ అమ్మడు సినిమాలో రెచ్చిపోయిందట. 

rakul preet singh lip kiss raviteja కోసం చిత్ర ఫలితం
ట్రైలర్స్ సాంగుల్లోనే కాదు సినిమా మొత్తం అమ్మడు స్కిన్ షో చేసిందట. బ్రూస్ లీ సినిమాలో కూడా చెర్రితో లిప్ లాక్ ప్లాన్ చేశారట డైరక్టర్ శ్రీనువైట్ల. కాని కిక్-2 సెంటిమెంట్ ప్రకారం ఆ సీన్ పెడితే దానిలానే ప్రేక్షకాదరణ పొందదేమోనని వద్దన్నాడట చరణ్. 

కడపలో నేను ఆ పని చేస్తా...అనుమతివ్వండి నాన్నగారూ ...

ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను దేనికదే అభివృద్ధిలో తేడా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు కృషి చేస్తున్నారు. మరోవైపు యువ నాయకుడు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన కార్యచరణకు సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనా నారా లోకేష్ ప్రత్యేకంగా కరవు సీమగా పేరొందిన రాయలసీమపై దృష్టి సారించినట్లు చెపుతున్నారు. 
lokesh
ఇక్కడ ఉపాధి అవకాశాలు సాధించుకుంటే సీమ నాలుగు జిల్లాల ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లే గతి పట్టదనీ, ప్రజలకు ఉపాధినిచ్చే భారీ పరిశ్రమలకు కృషి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేష్ తొలుత కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని కృషి చేస్తున్నారట. వైఎస్ హయాంలో ఫ్యాక్టరీ నిర్మించేందుకు 10 వేల ఎకరాలు కేటాయించినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 

ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతో కాకుండా ప్రభుత్వరంగ సంస్థలతోనే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయసహకారాలు కూడా కావాలని కోరినట్లు చెపుతున్నారు.

ఇలియానాకి ఎంగేజ్‌మెంట్

ఇలియానా ఈ మధ్య సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీ సైడ్ చూడడమే మానేసింది.తెలుగులో అయితే జులాయ్‌ తర్వాత మూవీనే చేయలేదు.బాలీవుడ్‌లో ఆఫర్స్‌ ఉన్నా లేకున్నా ముంబాయి తన అడ్డాగా మార్చుకుంది.ప్రస్తుతం ఇలియానా అస్ట్రేలియన్‌ కొరియోగ్రాఫర్‌ ఆండ్రూతో డేటింగ్‌ చేస్తుంది.ఈ విషయం పబ్లిక్‌గానే ఒప్పుకుంది.అంతేకాదు సెక్స్‌ అనేది జీవితంలో ఒక బాగం అని...సెక్స్‌ చేయడం వలన శరీరాకృతి బాగా ఉంటుందని చెప్పింది ఈ అమ్మడు.

ట్వట్టర్‌లో డైమండ్ రింగ్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది అమ్మడు.దీంతో ఇలియానాకి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని అందరూ పుకార్లు పుట్టిస్తున్నారు.అయితే కొందరు మాత్రం సెక్స్‌ గురించి డైరెక్ట్‌గా చెప్పిన ఈ గోవా బ్యూటి...ఎంగేజ్‌మెంట్ విషయం ఎందుకు దాస్తుందని అంటున్నారు.




బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ కోసం కండోమ్ దొంగిలించిన యువతి.. చంపేసిన తండ్రి.. ఎక్కడ?

 తన బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ కోసం కండోమ్ దొంగిలించిందన్న కన్నకుమార్తెను తండ్రి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. పాకిస్థాన్‌ దేశానికి చెందిన అసదుల్లా ఖాన్ (51), షాజియా(41) అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

వీరంతా కలిసి జర్మనీలో నివశిస్తున్నారు. ఖాన్ రెండో కుమార్తె పేరు లరీబ్. ఈమెకు జర్మనీ దేశానికి ముస్లిం యువకుడు రహీల్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఓ రోజున ఖాన్ ఇంటికి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఓ లేఖ వచ్చింది. 

అందులో లరీబ్ హ్యాండ్ బ్యాగు నుంచి కండోమ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఉంది. దీంతో ఖాన్, షాజియాలకు అనుమానం వచ్చింది. తమ కుమార్తె లైంగిక సంబంధాలు కలిగివున్నట్టు నిర్ధారించుకున్నారు. కుమార్తె చేసిన చర్య వల్ల తమ పరువు పోయేలా ఉందని భావించి ఆగ్రహోద్రుక్తులయ్యారు. దీన్నిజీర్ణించుకోలేని అసదుల్లా ఖాన్ కుమార్తె అని కూడా చూడకుండా కర్కశంగా కొట్టి చంపేశాడు. 

ఈ చర్యను భార్య షాజియా కూడా సమర్థించడం గమనార్హం. పైగా తన భర్త అలా చేయడానికి గల కారణాలను కూడా వివరించింది. 'లరీబ్ తన ఇష్టం వచ్చినట్లు ఉండేది. ప్రవర్తించేది. ఆమె చాలా సార్లు రాత్రిళ్లు ఇంటికి కూడా వచ్చేది కాదు. పైగా స్కార్ఫ్ కూడా వేసుకునేది కాదు. 

ఒకరోజు పోలీసుల నుంచి ఓ లెటర్ వచ్చింది. అందులో లరీబ్ కండోమ్స్ దొంగలిస్తూ పట్టుబడిందని ఉంది. దీంతో లరీబ్ లైంగికంగా సంబంధాలు కలిగి ఉందని తెలిసింది. దీన్ని చూసిన నా భర్త లరీబ్‌ని హత్యచేశాడు' అని చెప్పుకొచ్చింది. 

ఈ నెల 25న మాటీవి లో బాహుబలి.. 10 సెకండ్లకు 2.5 లక్షలు

టాలీవుడ్ చరిత్రను తిరగ రాయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 700 కోట్ల కలెక్షన్స్ ను కురిపించుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు క్రియేట్ చేసిన 'బాహుబలి' మరో చరిత్రను సృస్టించబోతోంది. ప్రముఖ మాటివి ఛానల్ 'బాహుబలి' బుల్లితెర ప్రసార హక్కులను 20 కోట్లకు కొనుక్కున్న విషయం తెలిసిందే. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈసినిమాను అక్టోబర్ 25వ తారీఖున దసరా ప్రీమియర్ షోగా బుల్లితెర పై ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
bahubali కోసం చిత్ర ఫలితం
అయితే ఈసినిమాను ప్రసారం చేస్తున్న మాటివి ఈసినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ కు 10 సెకండ్లకు 2.5 లక్షల టెలికాస్టింగ్ ఫీ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి యాడ్ స్ట్రాటజీ ఇప్పటి వరకు బుల్లితెర చరిత్రలో ఏ సినిమా పై ప్రయోగించలేదని టాక్. ఈ యాడ్ టరీఫ్ కు చాల మల్టీ నేషనల్ కంపెనీలు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా బుల్లితెర పై ప్రీమియర్ షోగా ప్రదర్శింప బడుతున్న నేపధ్యంలో ఈసినిమాలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల 'బాహుబలి' షూటింగ్ అనుభవాల క్లిపింగ్స్ ను కూడ ఈ ప్రీమియర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా మారుస్తారని టాక్.

People Like Too Much