పవన్ కళ్యాణ్ తో 'భజరంగీ భాయ్‌జాన్‌' రీమేక్...డిటేల్స్



pavan kalyaan to 'bhajarangi bhaayjaan' rimek...ditels
ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఏదీ అంటే 'భజరంగీ భాయ్‌జాన్‌'. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన భజరంగీ భాయిజాన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పాకిస్థాన్‌ బాలిక తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. 

ఈ నేపధ్యంలో ఈ చిత్రం రీమేక్ చేయటానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ రీమేక్ లో నటించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు టాక్స్ జరిగాయని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు, రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి నిర్మించనున్నారు. ఇక దర్శకుడు ఎవరూ అంటారా..ఇంకెవరు వరసగా దిల్ రాజుతో సినిమాలు చేస్తున్న హరీష్ శంకర్. హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం దబాంగ్ కు రీమేక్ కావటం విశేషం. సర్ధార్ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. మరో ప్రక్క... భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న 'బజరంగీ భాయిజాన్‌' 500 కోట్లకు చేరుకున్నాడని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 

గత నెల 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో సుమారు రూ.510 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. మన దేశంలో రూ.373.54 కోట్లు దక్కించుకోగా, విదేశాల్లో రూ.136 కోట్లు సాధించింది. 'పీకే'(రూ.735 కోట్లు), 'ధూమ్‌ 3' (రూ. 542 కోట్లు)లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌ వసూళ్ల విషయానికొస్తే 15 రోజులకు మన దేశంలో 'బజరంగీ...' రూ.276.36 కోట్లు వసూలు చేసింది. 'పీకే' (రూ. 338 కోట్లు), 'ధూమ్‌ 3' (రూ.284 కోట్లు)లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ వసూళ్లను 'బజరంగీ..' అధిగమించడం ఖాయమంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇక ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు సైతం ఇచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటి నుండీ ఇది చిరంజీవి సూపర్ హిట్ చిత్రం పసివాడి ప్రాణం కథ నుంచి ప్రేరణ పొందింది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిలీజై అంతటా అదే జోరుగా వినిపిస్తోంది. 

ఈ విషయమై ఈ చిత్రం కథ రచయిత విజియేంద్రప్రసాద్ సైతం నిజమైనన్నట్లు సమాచారం. విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ...చిరంజీవి 1987లో నటించిన పసివాడి ప్రాణం చిత్రం నన్ను అప్పట్లో బాగా కదిలించింది. దాన్ని పూర్తి మార్పులతో కాంటెంపరెరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ లోగా తాను ఓ పాకిస్దానీ జంట...తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం ఇండియాకు వచ్చినట్లు..అక్కడ ఖర్చు భరించలేక ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్త రావటం గమనించానని..కథని సిద్దం చేసానని అన్నారు. పసివాడి ప్రాణం సినిమాలో మూగ అబ్బాయి చుట్టూ కథ తిరిగితే..ఇక్కడ మూగ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. తాను ఇటీవల నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. 

ఈ విషయమై యూపి గవర్నమెంట్ స్పందించి... 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు అమలుచేయవలసిందిగా సల్మాన్‌ఖాన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ను కలిసి చర్చించారు. దీంతో భజరంగీ భాయ్‌జాన్‌కు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారవర్గాల వెల్లడించాయి. పాకిస్థాన్‌ బాలికను స్వగ్రామానికి చేర్చేందుకు ఓ భారత యువకుడు ప్రయత్నించిన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని తాను కోరుకుంటున్నానని, అయితే పన్ను మినహాయింపు ఇస్తే సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఉపయోగించినట్లే అవుతుందని సల్లుభాయ్‌ పేర్కొన్నారు. 

ఈ చిత్రాన్ని సామాజిక కోణంలో చూడాలని భారత, పాక్‌ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌ షరీఫ్‌లకు సల్మాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం గురించి అమీర్ ఖాన్ పొడగ్తల్లో ముంచెత్తారు..భజరంగీ భాయ్‌జాన్‌ను ఆమిర్‌ ముంబయిలో వీక్షించాడు. సల్మాన్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం. అదరగొట్టేశాడంటూ సల్మాన్‌ని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచేశాడు. ఇప్పటి వరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో భజరంగీ భాయ్‌జాన్‌ ద బెస్ట్‌, మంచి కథ, సంభాషణలు, కబీర్‌ ఖాన్‌ చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ ఆమీర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. 'బజరంగీ భాయిజాన్‌' చూసినవాళ్లలో చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా పతాక సన్నివేశాల్లో సల్మాన్‌ కంటతడి పెట్టించాడని సామాజిక అనుసంధాన వేదికల్లో రాసుకొస్తున్నారు. కథానాయకుడు ఆమీర్‌ ఖాన్‌ ఇటీవల ముంబయిలో ఈ సినిమా చూసి బయటకొస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. 

ఆ తర్వాత ''సినిమా బాగుంది. ఇప్పటివరకు వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ సినిమాల్లో ఇదే అత్యుత్తమం. సల్మాన్‌ నటన అద్భుతంగా ఉంది. కథ, కథనం, సంభాషణలు చాలా బాగా కుదిరాయి. కబీర్‌ ఖాన్‌ చక్కటి సినిమా తీశాడు. అందరూ చూడదగ్గ సినిమా. చిన్నపాప హర్షాలీ మీ మనసులు దోచుకుంటుంది'' అని ట్వీట్‌ చేశాడు ఆమీర్‌ ఖాన్‌. దర్శకుడు మాట్లాడుతూ... ''కొత్త కొత్త ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరపడం అంటే నాకు చాలా ఇష్టం. అనేక ప్రాంతాలు పరిశీలించి ఈ సినిమా కోసం లొకేషన్లు ఎంచుకున్నాను. కొండలు, గుట్టలు, హిమానీనదాలు.. ఇలా చాలా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. సల్మాన్‌ ఖాన్‌ అయితే మనమిద్దరం ట్రెక్కింగ్‌ చేస్తూ లొకేషన్‌కు వెళ్దాం అనేవారు'' అని చెప్పారు కబీర్‌ ఖాన్‌. భారత్‌- పాక్‌ నేపథ్యంలో సినిమాలు తీయడం ఈయన ప్రత్యేకత.

కే సి ఆర్ "తిట్ల" వారసుడు అమెరికాలో ఉన్నాడు?

తెలుగులో పచ్చి బూతులు నేర్చుకోవాలంటే తెలంగాణా గౌరవ ముఖ్యమంత్రి కె సి ఆర్ దగ్గరికి వెళ్ళాలి.  కాని అమెరికాలో ఉండే ప్రజలకు బూతులు తిట్టడం ఎవరు నేర్పిస్తారు. వారికి కుడా ఒక వారసుడు ఉన్నాడు. ఆయనే వాషింగ్టన్ మేయర్ ... ఈయన తిట్లలో కె.  సి. ఆర్ ను మించి పోయాడు . 

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ది గొరిల్లా లాంటి ముఖం అని, అది కోతిలాంటి ఒబామాకు మాత్రమే నచ్చుతుందని వాషింగ్టన్ మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ఒబామా కుటుంబాన్ని కోతులు గొరిల్లాలతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 
michel di 'gorilla' mukhan.. kotilaanti obaamaake
ప్రపంచ తొలి మహిళ మిచెల్ ఒబామాది 'గొరిల్లా ఫేస్' అని, ఆమెను 'మంకీ మ్యాన్ ఒబామా' తప్ప మరెవరూ ఇష్టపడరన్నారు. కావాలంటే వారి చెవులు చూడండి అంటూ తెలిపారు. పాట్రిక్ వ్యాఖ్యలు అమెరికాలో పెద్ద దుమారాన్నే రేపాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన వెంటన పదవికి రాజామానా చేయాలని పలు వర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే దీనికి ఆయన నిరాకరించాడు. అంతేకాకుండా నేను తప్పు చేశాను. నా తప్పు నాకు తెలుసు. ఒకవేళ నేను రాజీనామా చేస్తే, నేను జాతి విద్వేష పూరితుడినని ఒప్పుకున్నట్టు అవుతుంది. కానీ నేను కాదు" అని ఆయన అన్నారట.

టుబుకి పెళ్ళిపై గాలి మల్లిందా!

ఏ వయసులో జరగాల్సింది.. ఆ వయసులో జరగాలంటారు పెద్దలు. అయితే కెరీర్ అని.. ఇంకోటని.. పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేస్తుంటారు కొందరు సినీ తారలు.... ఒంటి మీదకు వయసు వచ్చి పడిపోతున్నా.. పెళ్లి ఊసే ఎత్తకుండా టైంపాస్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఇలా సోలో లైఫ్ ను లీడ్ చేస్తున్న వారి లిస్ట్ తీస్తే చాంతాడంత అవుతంది. 
tabu marriage photos కోసం చిత్ర ఫలితం
ఈ జాబితాలో ముందు వరుసలో సీనియర్ బ్యాచలర్ సల్మాన్ ఖాన్ ఉండగా.. ఆ తర్వాతి స్థానం ఆక్రమించుకుంది ముదురు భామ టబు. నిన్న మొన్నటి వరకు మ్యారేజ్ మ్యాటర్ ఎత్తితే.. నాకు లేని తొందర మీకు ఎందుకంటూ ఓ టైపులో చూసే ఈ టబుకు సడన్ గా మనువుపై మనసైంది. అందుకే సందర్భం ఏదైనా పెళ్లి గురించి తెగ స్టేట్ మెంట్ల్ ఇచ్చేస్తూ.. మాఘమాసం ఎప్పుడోస్తుందో అంటూ హమ్ చేస్తోందిఇన్నాళ్లుగా పెళ్లి లేదు గిల్లి లేదు అన్న టబు.. 
tabu marriage photos కోసం చిత్ర ఫలితం
పెళ్లికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పదిపదిహేనేళ్ల క్రితం గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అంటూ సాంగేసుకున్న టైంలో అయితే ఎవరో ఒక అందగాడు దొరికేవాడు. కానీ ఇప్పుడీ లేటు వయసులో పెళ్లి ప్రపోజల్ పెడితే.. ఎవరు చేసుకుంటారు అన్నది సినీజనాల కామెంట్.... ఫార్టీ ప్లస్ లో పెళ్లి, ఫ్యామిలీ, పిల్లలు అని కలలు కనే కంటే.. ఇంకొంచెం ముందే మేల్కొంటే బాగుండేదని సెటైర్స్ వేసేస్తున్నారు.... అంతేకాదు ఏజ్ బార్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటే.. ఇబ్బందులు వస్తాయని కూడా ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారట..

ఆ హీరొయిన్ బొడ్డు బాలేదని గ్రాఫిక్స్ తో సరి చేసిన దర్శకుడు ?

రకుల్ ప్రీత్ నడుము కోసం చిత్ర ఫలితం
వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు లో కెరియర్ ని స్టార్ట్ ఎక్స్ ప్రెస్ స్పీడ్ లో దూసుకపోతున్న హీరోయిన్ 'రాకుల్ ప్రీతి సింగ్', ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైం లోనే టాలీవుడ్ అగ్ర హీరోలందరితో జత కట్టే అవకశం పొందింది..అయితే ఈ అమ్మడి బొడ్డు బాగలేదని ఓ దర్శకుడు గ్రాఫిక్స్‌తో అడ్జస్ట్ చేశార‌ట.
రకుల్ ప్రీత్ నడుము కోసం చిత్ర ఫలితం
ఇంతకి ఆ బొడ్డు మేటర్ ఏంటో మీరే చదవండి. మంచు మనోజ్ - రాకుల్ కాంబినేషన్‌లో వచ్చిన కరెంట్ తీగ చిత్రం లో హీరో , హీరోయిన్ మద్య వచ్చే ఓ రొమాంటిక్ సీన్ లో రకుల్ ప్రీత్ నడుము చూడ్డానికి అదిరిపోయినా బొడ్డు బాగాలేదని ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్‌రెడ్డి బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ విద్యాబాలన్ బొడ్డును గ్రాఫిక్స్ చేసి , రాకుల్ బొడ్డు లో కలిపి వాడారట..ఈ న్యూస్ లేట్ గా బయటకు వచ్చి హాట్ గా ప్రచారం జరుగుతుంది..మరి మీరు కూడా ఆ బొడ్డు ఫై ఓ లుక్ వెయ్యండి.

బాహుబలి 2 లో కాళకేయుడి పాత్ర ఇంకా బీభత్సం..!!

ఎస్ ఎస్ రాజమౌళి తీసిన 'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా హంగామా చేస్తుంది. ఇప్పటికే 350 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీలో మునుపెన్నడు రాని సంచలనాలు ఈ సినిమా ద్వారా వచ్చాయి. అసలు తెలుగు వారు ఈ రేంజ్ లో సినిమాలు తీయగలరా అన్న వారికి చెంపపెట్టుగా మారింది. 
కాళకేయ కోసం చిత్ర ఫలితం
ఇప్పటి వరకు రెండు వందల కోట్ల కలెక్షన్స్ బాలీవుడ్, కోలీవుడ్ లో నే ఉండేది అదే పెద్ద రికార్డుగా భావించే వారు ఇప్పుడు మూడు కాదు నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే బాటలో 'బాహుబలి' ఉంది. ఇకపోతే రాజమౌళి తన సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక క్రియెటివిటీ ఆలోచిస్తాడు.. బాహుబలి చిత్రంలో ఒక భాషనే కనిపెట్టాడు కిల్ కిల్ భాష మునుపెన్నడు ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయలేదు. అంతేకాదు డైలాగుల్లేని చిన్నా చితకా వేషాలు వేసి 'మర్యాద రామన్న' చిత్రంలో చేసిన బైర్రెడ్డి క్యారెక్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రభాకర్‌ లేటెస్ట్‌గా 'బాహుబలి'లో చేసిన కాళకేయుడి క్యారెక్టర్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 
కాళకేయ కోసం చిత్ర ఫలితం
టి.వి. ఛానల్స్‌ పోటీపడి మరీ అతని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. ఈ ఘనత తనది కాదని రాజమౌళి తనకు దేవుడి లాంటి వారని ప్రభాకర్ ప్రతి ఇంటర్వూలో చెబుతున్నాడు. బాహుబలి లో కాళకేయుడిగా ప్రభాకర్ ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను' అంటూ ఎంతో వినయంగా చెప్తున్న ప్రభాకర్‌ 'బాహుబలి2'లో కూడా తన క్యారెక్టర్‌ వుందంటున్నాడు. 

అయితే 'బాహుబలి-2' లో మళ్ళీ నా పాత్ర ఉందని చెబుతున్నాడు.మొదటి భాగంలో చనిపోయిన కాళికేయుడు రెండ భాగంలో ఎలా ఉంటాడాన్ని ప్రశ్నిస్తే..? దానిని మీరు తెరపై చూస్తే తెలుస్తుందని రాజమౌళిని మించేలా షాక్ ఇస్తున్నాడు మన ప్రభాకర్. 

People Like Too Much