రెండు రోజుల పిల్లాడు రోడ్డుపై నడిచాడు .....నమ్మకపోతే ఈ వీడియో చూడండి ...



అస్సాంలో ఇదో దారుణం. రెండురోజుల చిన్నారిని ఓ మంత్రగత్తె సలహాపై బలవంతంగా నడిపించారు. గ్రామస్తులంతా చూస్తుండగానే ఆ బాలుడి తలిదండ్రులు ఇలా ఆ చిన్నారి మెడపట్టుకుని నడిపించారు. ఆ బాలుడికి తీవ్రమైన జ్వరం వస్తుండడంతో.. తలిదండ్రులు ఓ మంత్రగత్తెను ఆశ్రయించారు. 

జ్వరం తగ్గాలంటే ఇలా బలవంతంగా... బట్టలు లేకుండా నడిపించాలని ఆ మంత్రగత్తె చెప్పిందట. నిరక్షరాస్యులు, మూఢాచారాలను నమ్మే ఆ పేరెంట్స్ అలాగే చేశారు. 

మోరిగాన్ గ్రామంలో జరిగిన ఈ ఘటనను ఎవరో మొబైల్‌లో చిత్రీకరించి పోలీసులకు పంపారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరుకుని ఆ మంత్రగత్తెను అరెస్టు చేసి శిశువును ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ చిన్నారి కోలుకుంటున్నాడు

plus me





People Like Too Much