మీ కంప్యుటర్ లో విండోస్ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవటం ఏలా..?

కోట్లాది మంది ఎదురుచూపుల మధ్య మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో లభ్యమవుతోంది. విండోస్ 7, 8.1 జెన్యున్ ఓఎస్‌లను వినియోగిస్తున్న వారు విండోస్ 10ను ఉచితంగా తమ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 
windows 10 కోసం చిత్ర ఫలితం
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను మీ పీసీలో ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వివరణాత్మక టుటోరియల్‌ను విడుదల చేసింది. ఈ టుటోరియల్‌ను ఫాలో అవటం ద్వారా విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్ విండోస్ 10ను మాన్యువల్‌గా మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 

విండోస్ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకునేందుకు అవసరమైనవి: విండోస్ 7, లేదా విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (జెన్యున్ కాపీ), మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, (గమనిక: విండోస్ 10ను మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు డివైస్‌లోని డేటాను పూర్తిగా బ్యాకప్ చేసుకోవాలి). ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభించేముందు మీ సిస్టం సామర్థ్యాన్ని బట్టి ఈ రెండు ఫైల్స్‌లో ఒకదాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. 

Media Creation Tool 32-bit
Windows Media Creation Tool 64-bit
Windows విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు... స్టెప్:1 స్టెప్:1 పైన ప్రొవైడ్ చేసిన లింక్స్‌లో మీ సిస్టం కాన్ఫిగరేషన్‌కు సరిపోయే మీడియా క్రియేషన్ టూల్‌ను ఎంపిక చేసుకుని మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోండి.

ఏమి ఐడియా మామా... ? గాలం వేస్తె రూపాయలే రూపాయలు ?


ఓ యాడ్ లో చూపించినట్లు ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్ అన్నట్లు.. మత్సకారుల ఓ ఐడియా కాసులు కురిపిస్తోంది. ఏంటా ఐడియా అనుకుంటున్నారా..? అదేంటంటే ఎలాగూ వేటకు వెళ్లలేరు కాబట్టి పుష్కరాలు జరుగతున్న ఘాట్ లలో చిన్న చిన్న బోట్ లు వేసుకొని తిరుగుతున్నారు. 
Fishermen idea rocks in godavari pushkaralu

పుష్కరాలకు వచ్చిన భక్తులు తమ కోరికను తీర్చాలంటూ గోదావరి తల్లికి నాణెలు వదులుతుంటారు. ఒక రూపాయి, రెండు ఐదు, పది రూపాయల నాణేలను వదలుతుంటారు. అయితే ఈ డబ్బుల మీదే మత్పకారులు దృష్టి సారించారు. చిన్న చిన్న బోట్ లలో తిరుగుతూ అయస్కాంతాలను కర్రలకు చుట్టి నీళ్లలోకి వదులుతున్నారు. 

అలా నీటిలోకి వదలడం వల్ల నాణేలు అయస్కాంతానికి అతుకుతున్నాయి. ఇంకేముంది వాటిని అలా ఒడిసిపట్టి... కాసుల వర్షంలో తేలుతున్నారు. అయినా తెలివి ఉండాలే కానీ ఆదాయానికి కొదువా చెప్పండి  .ఏమి ఐడియా రా మావా. .. ?


నిన్న పాలమూరు,నేడు జపాన్ లో గ్రహాంతర వాసులు!


ప్రస్తుతం ఆధునిక ప్రపంచం సాంకేతికంగా ఎంతలా అడుగులు ముందుకు వేసినా కొన్ని జవాబు దొరకని ప్రశ్నలు, సంఘటనలు ఎదురై మనల్ని ఆశ్చర్యంలో, కొంత భయంలో ముంచెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా గతంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో, తాజాగా తెలంగాణాలోని పాలమూరు జిల్లా అచ్చంపేటలో ఆకాశంలో వింత ఆకారాలు కనబడి అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేశాయి.

తాజాగా జపాన్ లోని ఒసాకాలో కూడా తెల్లని పక్షుల్లాంటి ఆకారాలు ఆకాశంలో కనబడడంతో జపనీయులు ఆశ్చర్యపోయారు. సుమారు రెండు నిమిషాల పాటు కనిపించిన ఈ దృశ్యం వీడియోను జపాన్ యూ ట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు. 

ఇవి ఎగిరే పళ్ళాల్లా లేవని, కాకపోతే మరేవై ఉంటాయని వారంతా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ వీటిని కొంతమంది గ్రహాంతర వాసులు అంటూ భయపడుతుంటే, కొంతమంది వీటివల్ల అరిష్టం సోకుతుందేమోనని భయపడుతున్నారు. మరి ఇలాంటి వింత సంఘటనలకు ఎప్పటికి జవాబు దొరుకుతుందో వేచి చూడాలి.




కరెన్సీ నోటు పై కలాం కు చోటు కల్పించాలి!

మాతరం గాంధీని చూడలేదు, కానీ మేం చూసిన గాంధీవి నువ్వే, మా స్పూర్తి ప్రధాతవు నువ్వే ..అంటూ కలాంకు సలాం చేశారు. మరికొంత మందైతే కరెన్సీ నోట్లపై కలాం ఎందుకుండకూడదు అంటూ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి, భారతరత్న అవార్డీ, దేశ అత్యున్నత రాజ్యంగ బద్ద పదవిని అలంకరించిన వ్యక్తి, అన్నింటికి మించి అద్బుత శక్తి, ఇంకా చెప్పాలంటే కల్మషం లేని మనిషి, గాంధీని మించిన అహింసావాది. 

karensi  notu pai kalaam ku
ఇన్ని లక్షణాలు ఉన్న కలాంకు కరెన్సీ మీద ఉండే అర్హత నూటికి నూరు శాతం ఉంది అంటూ తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఎలాగో ప్రభుత్వం కూడా ఫ్లాస్టిక్ కరెన్సీని వాడుకలోకి తేవాలనే ప్రయత్నంలో ఉంది కాబట్టి.. 100 ,500,1000 నోట్లలో ఎదో ఒక కరెన్సీ ని అబ్దుల్ కలాం ఫోటో తో విడుదల చేయాలనే డిమాండ్ లువినిపిస్తున్నాయ్ ..

ఇండియన్ కరెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి కరెన్సీ నోటు పై గాంధీ ఫోటోనే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఉన్నపలంగా గాంధీని తొలగించాల్సిన అవసరం లేనప్పటికీ, కలాం కు కూడా ఇండియన్ కరెన్సీ లో స్థానాన్ని కల్పించాలని కొరుతున్నారు కలాం అభిమానులు. ఇదిగో వాళ్లు రూపొందించిన నినాదాన్ని మీరూ చూడండి ఈ ఫోటో లో. మరి మీరేమంటారు. ఇండియన్ కరెన్సీ హిస్టరీలోకి తొంగి చూస్తే.. ఇండియాలో మొదటి సారిగా షేర్‌షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. 

ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు "బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్" (1770-1832), స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. అంటూ డిఫరెంట్ గా ఉండేవి. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. 1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించారు. 5 రూపాయల నుండి 1000రూపాయల వరకు ఉన్న నోట్లను మహత్మాగాంధీ శ్రేణి అంటారు.

తడబడి .. తప్పు చేసిన అనుష్క...!



బాలీవుడ్ నటి అనుష్క శర్మ తడబడింది. సెలెబ్రెటీ అయి ఉండి కూడా నిర్లక్ష్యంగా తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసి నెటీజన్ల కోపానికి గురయ్యింది. నిన్న రాత్రి కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కు ట్విట్టర్ లో నివాళులర్పించాలని భావించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క పెద్ద పోరపాటు చేసింది . 
anushka .tadabadi, tappu chesindi.
అందరూ ట్వీట్ చేస్తున్నారు నేనెందుకో చేయకూడదు అనుకుంటో ఏమో..Abj kalam Azad Rip అంటూ ట్వీట్ చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం అనే పేరుకు బదులుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు తప్పుగా రాసి ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని వాటిని తొలగించి అభాసుపాలు అయ్యింది . ఏపీజే అబ్దుల్ కలాం పేరు కి బదులుగా "ఏబీజే కలాం ఆజాద్ " అని ఒకసారి "ఏపీజే కలాం ఆజాద్ " అని మరోసారి ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది అనుష్క శర్మ . 

దేశం గర్వించతగ్గ మహా నాయకుడు అయిన ఏపీజే అబ్దుల్ కలాం పేరు అనుష్క కు తెలియకపోవడం మరీ విచిత్రం పోనీ తెలియకపోయినప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది . కానీ అనుష్క ఆ పని చేయకుండా తొందరపడి ట్వీట్ చేసింది. సెలెబ్రీటీలు ఏదైనా ఒక పోస్ట్ చేస్తే ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది.

అబ్దుల్ కలాంకు మనకు మద్య ఉన్న సంబంధం ఏమిటి?



 మీ మాటలు మీ ప్రసంగాలు ప్రత్యక్షంగా వినకపోయిన మీరు రాసిన పుస్తకాలు చదివాము. ఒక ఋషికి సాధ్యంకాని ఆథ్యాత్మికత అందులో మాకు కనిపించింది..

ఒక రాజకీయనాయకుడు ఎలా ఉండాలో మీరు చెప్పారు..యువతి,యువకుల గురించి మీరు చెప్పిన మాట మేమెప్పుడు మర్చిపోలేము.. (ఇప్పుడు నా ఎదుట ఉన్న యువతీ యువకులు ఎన్నడూ ధైర్యాన్ని,ఉత్సాహన్ని వీడకుందురు గాక.నీ ముందున్న కర్తవ్యాన్ని సాహసంతో దీక్షతో స్వీకరించినప్పుడే విజయం సిద్ధిస్తుంది) నేను ..నాది అని నిత్యం స్వార్ధంలో మునిగి తేలుతున్న మాకు ..మీరు ఇచ్చిన పిలుపు మరిచిపోలేనిది.. (మనిషి తనకు కావల్సిందాన్ని మించి అదికంగా అధికారాన్ని గానీ, సంపదని గానీ పోగు చేసుకున్నాడా అప్పుడతడు తన చేజేతులా వినాశనాన్ని, అశాంతిని, విధ్వంసాన్నీ కోరితెచ్చుకున్నట్టేనని మనం మరువకూడదు). 

మహానుభావా మా కళ్ళతో నీన్ను చూడగలగటం మా అదృష్టం.. మీరు నాటిన విత్తనాలే మా తరానికి మహావృక్షాలు ..మీరు లేని భారతావని ఊహకు అందనిది ..మీ సమస్తాన్ని ప్రజలకోసం,పేదలకోసం ఖర్చుచేసారు,మా కన్నీళ్ళు ఆగటంలేదు.. మీకు మాకు రక్తసంబంధం లేదు కాని అంతకు మించి ఒక భారతీయునిగా మీకు మాకు ఒక మహత్తర సంబంధమే ఉంది,అందుకే మా హృదయాలుఏడుస్తున్నాయ్ 

....కన్నీళ్ళు కారుతున్నా కలం మాత్రం ఆగటంలేదు. కలాంజీ. రియల్లీ వి మిస్ యూ...

కలికాలం ... ' వీర్యం' కూడా అమ్మకానికి ఆన్ లైన్ లో దొరుకుతోంది.?

aan lain lo 'viryan'.

ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా షాప్ కు పోనవసరం లేకుండా..మీరు ఏది కావాలంటే అది క్షణాల్లో మీ ఇంటి ముందు ఉండే విధంగా ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది..దీని క్యాష్ చేసుకొని వినియోగ దారులు కూడా ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ కే అలవాటు పడుతున్నారు.
online కోసం చిత్ర ఫలితం
తాజాగా చెన్నై లో ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఏకంగా 'వీర్యం' కూడా అమ్మకానికి పెట్టేసి యూత్ ని ఆకర్షిస్తున్నారు..తబావో అనే వెబ్సైటు చైనీయులనుండి సేకరించిన వీర్యంన్ని అమ్మకానికి పెట్టారు. ఒక్కో వీర్య దాతకు 500 నుండి 700 డాలర్లు సొమ్మును వారికీ అందిస్తుంది ఈ వెబ్ సైట్. ఇప్పుడు ఈ సైట్ కు ప్రజలనుండి మిశ్రమ స్పందన వస్తుంది. 

ఇప్పటికే వీర్యంన్ని దానం చేయడానికి 20 వేల మంది ముందుకు వచ్చినంటు సమాచారం..ఇక భారత్ లో కూడా ఇలాంటి ఆఫర్ వస్తే బాగుండు అని ఇక్కడి యూత్ ఆలోచిస్తున్నారు.

ఆమెను చూడగానే దేవిశ్రీ ప్రసాద్ గుండె కాస్త గట్టిగానే కొట్టుకున్నది? అదేమిటి ?

devi sri prasad praneetha కోసం చిత్ర ఫలితం

ఓ వైపు మ్యూజికల్ హిట్స్ తో దక్షిణాది సినీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్... హీరోయిన్లతోనూ సరదా సరదాగా ఉంటారనే టాక్ ఉంది. అందాల భామలతో అనుబంధం కారణంగా మనోడికి పెళ్లి వైపు మనసు మళ్లడం లేదని సినీ జనం గుసగుసలాడుకుంటుంటారు.

 హాట్ బ్యూటీ ఛార్మి, దేవిశ్రీ ప్రసాద్ మధ్య చాలా రోజుల రొమాన్స్ నడించిందనే వారూ లేకపోలేదు. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా... వీరి మధ్య ఏదో ఉందనో రూమర్స్ మాత్రం అప్పట్లో బాగానే వినిపించాయి. ఇదిలా ఉండగానే... తాజాగా దేవిశ్రీప్రసాద్ ఓ నయా హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తెలుగులో సక్సెస్ లు దక్కించుకున్నా... స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోతున్న కన్నడ బ్యూటీ ప్రణీతతో దేవిశ్రీప్రసాద్ ఈ మధ్య బాగా సన్నిహితంగా ఉంటున్నాడట. ప్రస్తుతం ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న ప్రణీత కూడా దేవిశ్రీతో మాట్లాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

దీంతో.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ లోకి మరో కొత్త హీరోయిన్ చేరిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొందరైతే... ప్రణీతకు కొత్త ఆఫర్లు వెతికిపట్టే పనిని కూడా దేవి తీసుకున్నాడేమో అని చర్చించుకుంటున్నారట. మరి... ఈ ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని వస్తున్న రూమర్స్ పై వీరిలో ఎవరు ముందుగా స్పందిస్తారో చూడాలి. 

34 ఏళ్ల తరువాత కనిపించిన శివుడు ?




అది సప్తనదీ సంగమ క్షేత్రం! మూడున్నర దశాబ్దాల కిందట భీమలింగేశ్వరుడు అక్కడ జలాధివాసమయ్యాడు! ఆలయ ప్రధాన వేద పండితుల కృషి ఫలితంగా ఇన్నాళ్లకు మళ్లీ భీమలింగేశ్వరుడు దర్శనమిచ్చాడు. 

దీంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక, చారిత్రక, ఇతిహాస అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీశైల జలాశయ నిర్మాణం పూర్తి కావడంతో సరిగ్గా 34 ఏళ్ల కిందట ప్రాజెక్ట్‌ వెనుక జలాల్లో భీమలింగేశ్వరుడు జలాధివాసం అయ్యాడు. 

అయితే, 13 ఏళ్లనుంచి ఏటా వేసవిలో సప్తనదీ జలాల నుంచి సంగమేశ్వర క్షేత్రం బయటపడినా.. పూడిక కారణంగా భీమలింగం మాత్రం ఆనవాళ్లు కూడా కనిపించకుండా మట్టి పేరుకుపోయింది.


పదవ తరగతి కుర్రాడి ప్రేమకు టీచర్ గ్రీన్ సిగ్నల్? పెద్దలు చేసిన పెళ్లి? పెళ్లి వీడియో చుడండి?

10th class student married his class teacher in tamil nadu కోసం చిత్ర ఫలితం
దీనిని ప్రేమ అనాలో, మరేమనాలో మాకైతే తెలియదు కానీ…. ఈ రివర్స్ సుందరాకాండ  మాత్రం తమిళనాడులో జరిగింది. క్లాస్ టీచర్ ను స్టూడెంట్ పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు  సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. తమిళనాడు లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న అజిత్ అనే కుర్రాడు, తన క్లాస్ టీచర్  వైష్టవి ని లవ్ చేశాడు.  దీనికి ఆ టీచరమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయం  ఇద్దరి ఇంట్లో తెలిసింది.

మ్యాటర్ పెద్ద గొడవకు దారి తీస్తుందనుకుంటున్న సమయంలో… ఇద్దరి పేరెంట్స్ వీరి పెళ్లికి ఓకే చెప్పేశారు. దీంతో అందరి ముందే ఆ 14 యేళ్ల అబ్బాయి. తన టీచర్ మెడలో మూడు ముళ్లు వేసేసాడు.  చట్ట ప్రకారం అబ్బాయి వయసు  పెళ్ళికి సరిపోదూ కానీ,  అందరూ ఓకే అన్న తర్వాత ఎవరేం చేస్తారు. పాఠాలు బాగా చెబుతుంది అనుకున్నారేమో పేరెంట్స్ కూడా నో చెప్పలేక పోయారు.

ప్రేమ గుడ్డిది అని అంటుంటారు. కానీ మరీ ఇంత గుడ్డిది అని మాత్రం వీరు ప్రూవ్ చేశారు. ఆ టీచర్ చెప్పింది సిలబస్  పాఠాలా ? లేక ప్రేమ పాఠాలా ? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. దీనిపై విద్యాశాఖ అధికారులు   దర్యాప్తు చేపట్టారు.  వివరణ ఇవ్వాలని ఆ స్కూల్  హెచ్ ఎం ను ఆదేశించారు.

పెళ్లి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : CLICK HERE WATCH VIDEO

ఒక అమ్మ కు వంటి మీద బట్ట కరువు! మరో అమ్మ కు వంటి మీద బట్ట బరువు!!

శ్రీశ్రీ..  ఆధునిక  తెలుగు సాహిత్యయుగాన్ని తన భుజాలపై ఎత్తుకొని పరిగెత్తించిన కవి. విప్లవ కవిగా,  సమాజంలోని అన్ని కోణాలను తన కవితలతో అద్దం పట్టిన మహానుభవుడు అతను. కాంమెట్రీ పోయెట్రీలో ఆయనను మించిన వారుండరంటే అతిశయోక్తి కాదు. పదాలతో సమ్మెట పోటులు వేయగల నేర్పరి, పోయెట్రీతో అనాథల, బీదల థైన్యాన్ని పలికించగల మానవతా వాది.



SRISRI

అటువంటి మహానుభావుడు రాసిన ఒక కవిత : 


ఒక అమ్మ కు వంటి మీద బట్ట కరువు!

మరో అమ్మ కు వంటి మీద బట్ట బరువు!!

ఒకరిది రేషను,! మరోకరిది పేప్షను.!!

ఇద్దరిది వేదనే అంటాడు వేదాంతి!!!

కాదు కాదు అంటాడు రాద్దాంతి!!!!

వారి గ్రహస్తితులు తేడా అంటాడు సిధ్ధాంతి.!!!!

ఇద్దరూ  స్త్రీ లే అంటాడు ఫెమినిస్టు!!!

అన్యాయం జరిగిందంటాడు పోలిటీషను!

ప్రభుత్వం బాద్యత వహించాలంటుంది అపోజీషను!!!!!

నాదృష్టకి రాలేదంటాడు మినిష్టరు!!!

కమీషన్ వేస్తానంటాడు చీఫ్ మినీష్టరు!!!!

బట్ట బరువు అయిన అమ్మ కు ఎంత కష్టమొ అంటాడు కేప్టలిస్టు !!!

బట్ట కరువుకు కారణం శ్రమ దోపిడే. అంటారు మార్కిస్టు!!

ఎదైతే మాకేంటి అంటారు అనార్కీస్టులు!!!

ఇదంతా సాదారణమే అంటూ కోట్టి పడేస్తారు మద్యతరగతి జనం.!!!!



బారతదేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మీకు తెలీదా లవ్ ఎఫైర్స్ వల్లనే ?


radha mohan sing కోసం చిత్ర ఫలితం
రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అందరికి తెలుసు. అయితే ఓ మంత్రి గారు అది కూడా కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ మాత్రం దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో వింటే అవాక్కవుతారు. 

అవును ఆయన గారి ప్రకారం డ్రగ్స్, లవ్ ఎపైర్స్, పిల్లలు పుట్టక పోవడంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రిగారు శెలవిచ్చారు. అయితే అది కూడా ఏదో సభలో అలా అనుకోకుండా అన్నారు అంటే అదీ కాదాయె... మంత్రి గారు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యసభలో మంత్రిగారి నిర్వాకంతో దేశం మొత్తం విస్తుపోతోంది. రైతు ఆత్మహత్యల మీద బాధ్యత కలిగిన మంత్రిగా మాట్లాడాల్సిన వారే ఇలా చెత్త కారణాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటు.

ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల మీద ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పేట్ పరిచి మరీ స్వాగతం పలికే ప్రభుత్వ యంత్రాంగం.. అన్నం పెడుతున్న అన్నదాతల ఆత్మహత్యల మీద మాత్రం పెద్దగా స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటు. 

ఆరుకాలాలు కష్టించే అన్నదాత కష్టాన్ని గుర్తించడం మాట అటుంచి.. అన్నం పెట్టే అన్నదాతలే ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి గారు మాత్రం వాటికి వేరే కారణాలు ఉన్నాయంటూ చెత్త కారణాలను ఎత్తి చూపడం నిజంగా సిగ్గు చేటు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది.. లవ్ ఎపైర్ వల్ల అంటూ వ్యాఖ్యానించడం చాలా దురదృష్టం. ఈ మాటలు విన్నాయంటే రైతుల ఆత్మలు ఘోషిస్తాయి. 


'అవంతిక' తమన్నా నిజంగా విప్పేసిందా...? ప్రభాస్ ...అలా చూస్తున్నాడు ఏమిటి?


prabhas-tamannah

బాహుబలిలో ప్రభాస్ తమన్నాల మద్య జరిగే సన్నివేశాలు శృంగారంలా కాకుండా మృగవాంచలా ఉందని విమర్శించింది. ఓ వీరనారి అయిన అవంతిక కూడా ఆడదే అన్నట్టు చూపించారు. నేను మగాడిని అని నిరూపించుకోవాలనుకుంటుంది హీరో పాత్ర. అవంతికకు ఇష్టం లేకుండా ఆ యువతి శరీరంపై టాటూలు వేపినట్లు చూపించాడు దర్శకుడు రాజమౌళి. 

అదే మన ఇంట్లో అమ్మాయితో ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించింది. ఒక అమ్మాయిని బలవంతంగా బట్టలు విప్పేసి వశ పురుచుకోవడాన్ని రేప్ కాక ఏమంటారు? ఆమె ఏమైనా జంతువా? ఈ సన్నివేశాలతో మీరు పబ్లిక్‌కి ఎలాంటి మెసేజ్ పంపుతున్నారు. ఇది సినిమా మాత్రమే చిల్ అంటే ఎంత మాత్రం ఒప్పుకోను. శివుడు అవంతికను రేప్ చేశాడని నేనంటాను, ప్రేమ ముసుగులో మృగవాంచ తీర్చుకున్నాడంటా. రాజమౌళి ఈ సన్నివేశాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారంటూ ప్రశ్నించింది. ఇలా చేయడం మగతనమనుకుంటే రాజమౌళి మృగమే అంటూ దుమ్మెత్తి పోసింది.

బాబోయ్ రాజమౌళి రొమాంటిక్ సీన్. బాహుబలి చిత్రంలో అవంతిక పచ్చబొట్టు పాట. బొడ్డుపై పండ్లను వేసి ఊరిస్తూ, నాభీ నృత్యాలతో ఊరిస్తూ చిత్రీకరించే గురువు కె. రాఘవేంద్ర రావును మించిపోయాడు శిష్యుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంలో అవంతిక, శివుడు రొమాంటిక్ సాంగ్ పచ్చబొట్టేసి... అనే పాట చివర్లో చూపించిన సన్నివేశం మామూలుగా లేదు. తమన్నా తన వీపును మొత్తాన్ని నగ్నంగా మార్చేయడమే కాకుండా పాట చివర్లో ముందు ఉన్న వస్త్రాన్ని కూడా తీసేసినట్లు చూపించేశాడు. 

ఆ సమయంలో ప్రభాస్ అందాలను ఆబగా చూస్తున్నట్లు పాటలో కనబడుతుంది. ఇక ఆ తర్వాత మామూలే. మొత్తంగా పాటలో తమన్నా దుస్తులను విప్పేసిందా అనే భ్రమ కలిగించాడు. ఇప్పుడు ఇదే విషయమై కుర్రకారు వాట్సాప్, ఫేస్బుక్ లో చర్చలు చేసుకుంటున్నారు. నిజంగా తమన్నా విప్పేసిందా అని క్వచ్చన్ పెట్టి చర్చలు చేసుకుంటున్నారు. 

ఇచ్చట కోళ్ళు అద్దెకు ఇవ్వబడును? మరి కోడి పెట్టిన గుడ్డు పరిస్థితి ?

adde kodi... fri guddu... akkadadante...! akkadadante...!..
అద్దె కోడి.. ఫ్రీ గుడ్డు... ఇదేమిటి? ఫ్రీ గుడ్డు విన్నాం..అద్దెకోడి ఏంటి? ఇదెప్పుడూ వినలేదే.. అనుకుంటున్నారా.. అదేమరి ఈ మధ్యలో ఆ దేశంలో కోడి గుడ్ల ధర ఆకాశాన్ని అంటుతోందట. ఇలా తరుణంలో గుడ్డు తినాలంటే భయమేస్తోందట. దీంతో అక్కడ అద్దె కోళ్ళను పెంచుకుని గుడ్డు తింటుంటారట. ఎక్కడ? కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని పెన్సిల్వేనియాలోని జెన్‌, ఫిల్‌ టాంప్కిన్స్‌ అనే దంపతులు గుడ్డు ప్రేమికుల కోసం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోళ్ళను అద్దెకిస్తే ఎలా ఉంటుందని యోచించారు. 

అనుకున్నదే తడవుగా.. 'కోళ్లు అద్దెకివ్వబడును' అని బోర్డు పెట్టేశారు. రెండు కోళ్లతోపాటు కోళ్ల గూడును కూడా అద్దెకిస్తున్నారు. ఒక కోడి వారానికి 8-14 గుడ్లు పెడుతుంది. నాలుగు నుంచి ఆరు నెలల వరకు అద్దెకిస్తాం. రెంటల్‌ అగ్రిమెంట్‌ పూర్తయిన తర్వాత.. యజమానికి ఇష్టమైతే.. ఆ కోళ్లను కొనుక్కుంటాడు. లేదంటే తిరిగి ఇచ్చేస్తారని జెన్‌ తెలిపారు. 

ప్రాంతాన్ని బట్టి దాదాపు 400 డాలర్లకు అద్దెకిచ్చేవారు. ఈ ఏడాది అద్దెను 600 డాలర్లకు పెంచారు. మొదట్లో అమెరికాలోని 12 రాష్ట్రాల్లో వీరికి 200 మంది కస్టమర్లు మాత్రమే ఉండేవారు. కానీ అమెరికాలో గుడ్ల ధరలు తరచుగా పెరుగుతుండటంతో.. చాలా మంది కోళ్లను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు


హాస్టల్ గదిలో అర్ధనగ్నంగా తిప్పిన సీనియర్ !

haastal gadilo ardhanagnanga tippina siniyar !
నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆర్కిటెక్చర్‌ ప్రిన్స్‌పాల్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరిపే కొద్ది ర్యాగింగ్‌కు సంబంధించిన దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ముందురోజు రిషికేశ్వరిని సీనియర్‌ విద్యార్థులు తీవ్రంగా వేధించారని, అర్ధనగ్నంగా హాస్టల్‌ గదిలో నడిపించి... దాన్ని సెల్‌లో చిత్రీకరించినట్లుగా వెల్లడయింది.. 

తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపించారని, తమతో సన్నిహితంగా ఉండకపోతే ఈ వీడియోలు బహిర్గతం చేస్తామని సీనియర్లు బెదిరించినట్లుగా తెలియవచ్చింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అనిషా, శ్రీనివాస్‌ అనే సీనియర్‌ విద్యార్థులతోపాటు శ్రీచరన్‌ అనే లెక్చరర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా రుషికేశ్వరి మృతి కేసులో ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాబూరావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. విద్యార్థినులతో ప్రిన్సిపాల్ బాబూరావు అసభ్యకర ప్రవర్తనను విద్యార్థినులు ఫోన్‌లో చిత్రీకరించి విచారణ కమిటీకి అందజేశారు. మీడియా సమక్షంలో వాటిని ప్లే చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు

బాహుబలి లో రానా అలాచేయడం నాకు నచ్చలేదు : స్నేహా ఉల్లాల్


baahubalilo raana sin nachhaledanna hiroyin.
విడుదలై అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న బాహుబలి చిత్రంలో ఓ సన్నివేశం పై అభ్యంతరం వ్యక్తం చేసింది సీనీనటి స్నేహా ఉల్లాల్. సినిమా అంతా బాగున్నప్పటికీ ఒక సన్నివేశం మాత్రం బాలేదని చెప్పేసింది ఈ నీలి కళ్ల సుందరి. 

కాలకేయునితో యుద్దానికి వెళ్లేముందు.. రానా, ప్రభాస్ లు తమ మాయిశ్మతీ దేవతకు మొక్కి యుద్దానికి వెళతారు. అయితే ఈ సంధర్భంలో రానా ఓ దున్నపోతు తలను నరికి ఆ దేవతకు బలిస్తాడు. ప్రభాస్ ను కూడా నరకమని చెబితే అతను దేవత బలి కోరితే మూగ జీవి ప్రాణం ఎందుకు, ఇప్పడే వేడితో పొంగుతున్న నా రక్తాన్ని దేవతకు నైవేధ్యంగా ఇస్తా అని తన రక్తాన్ని దేవత పాదాల మీద చల్లుతాడు. 

బాహుబలిలో రానా సీన్ నచ్చలేదన్న హీరోయిన్. అయితే స్నేహా ఉల్లాల్ మాత్రం, రానా దున్నను నరకడాన్ని తప్పుపడుతున్నారు. చరిత్రలో బలి గురించి ఉన్నప్పటికీ దానిని సినిమాలో పబ్లిక్ గా అలా చూపించడం తనకు నచ్చలేదని కుండబద్దలు కొట్టింది. 

తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది స్నేహా ఉల్లాల్. అయితే రాజమౌళి బలి విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు, దున్నను నరుకుతున్న షాట్ చూపించి రక్తం చిందే సీన్ ను చూపించాడు, కానీ దాని తల మీద వేటు పడిన విజువల్ ను చూపించలేదు. హీరోకు విలన్ కు మద్య తేడా చూపించడానికే రానాతో దున్నను నరికించాడు, ప్రభాస్ తో తన రక్తంతో దేవతకు నైవేద్యం పెట్టించాడు.


గర్భవతి అయిన 100 ఏళ్ల బామ్మ...?

garbhavati ayina 100 ella baamma... tappudu

గర్భవతి అయిన వందేళ్ల వయస్సైన బామ్మ చెకప్ చేయించుకునేందుకు ఆస్పత్రికి రావాలని లేఖ రావడం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లో వెస్ట్ సూసెక్స్ ప్రాంతానికి చెందిన మహిళ డెరిస్. ఈమెకు మరి కొన్ని రోజుల్లో 100వ పుట్టిన రోజు వస్తుంది. 

ఈ వృద్ధ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడి వయస్సు 76 సంవత్సరాలు. తన ముగ్గురు పిల్లలకు కలిగిన సంతానంతో మొత్తం 20 మందికి పైగా మనవళ్లు, మనవరాళ్లతో వెస్ట్ సూసెక్స్ ప్రాంతంలో డెరిస్ నివసిస్తూ వస్తోంది. ఈ స్థితిలో అబ్రహ్మాం కమ్యూనిటీ ఆస్పత్రిలో గత నెలలో ఆమెకు ఒక లేఖ వచ్చింది. అందులో ''నిండు గర్భవతి అయిన మీరు సెప్టెంబర్ 4వ తేది ఉదయం 9.45 గంటలకు మా ఆస్పత్రికి వచ్చి చీఫ్ గైనకాలజిస్ట్ వద్ద చెకప్ చేయించుకోవాలి'' అని రాసి ఉంది. 

ఆ లెటర్‌ను చూసి దిగ్భ్రాంతి చెందిన డెరిస్, ఈ లేఖను తన కుటుంబీకులకు చూపించింది. అనంతరం ఆ ఆస్పత్రికి ఫోన్ చేసి, వారి చర్యలను తీవ్రంగా ఖండించింది. దీంతో అలెర్ట్ అయిన ఆస్పత్రి సిబ్బంది డెరిస్ అనే మరో మహిళకు పంపాల్సిన లేఖను పొరపాటుగా ఈమెకు పంపినట్టు గ్రహించారు. అనంతరం ఆస్పత్రి నిర్వాహకులు డెరిస్‌ ఇంటికి వచ్చి తమ క్షమాపనలు చెప్పుకున్నారు.

శ్రీమంతుడు సినిమా చూడనున్న నరేంద్ర మోడీ ...!


narendra modi watch movie కోసం చిత్ర ఫలితం
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మహేష్ బాబు తాజా చిత్రం చూడనున్నారా...అందుకు అవకాసాలున్నాయి అంటోంది 'శ్రీమంతుడు' చిత్రం టీమ్. మహేష్‌బాబు హీరోగా నటించిన చిత్రమిది. 'వూరు దత్తత' అనే అంశానికి నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. 
srimanthudu కోసం చిత్ర ఫలితం
వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసమూ ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకొంటున్నారట. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 

వూరిని దత్తత తీసుకోవాలనే ఓ చక్కటి సందేశం చుట్టూ సాగే కథ ఇది. శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

బాహుబలి దెబ్బకు హాస్పటల్ లో చేరిన గుణశేఖర్..

gunasekhar rudrama devi కోసం చిత్ర ఫలితం

విడుదలకు ముందు ఎన్నో అంచనాలు, విడుదల తర్వాత ఆ అంచనాలు ఇంకా తక్కువే అనట్లు బాహుబలి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకపోతుంది..ఈ చిత్ర హిట్ తో అందరు హ్యాపీ గా ఉంటే దర్శకుడు గుణ శేఖర్ మాత్రం బాహుబలి టాక్ తో హాస్పటల్ లో జాయిన్ అయ్యాడు..

తను ఎంతో నమ్ముకొని దాదాపు 70 కోట్ల ఖర్చు పెట్టి నిర్మించిన 'రుద్రమదేవి' చిత్రం రిలీజ్ కాకుండా ల్యాబ్ లోనే ఉండిపోయిందనే బాధతో కొన్నిరోజలుగా అనారోగ్యం తో ఉన్నడట..అతను ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది . అనుష్క, అల్లు అర్జున్ , రానా మొదలగు భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో ఈనెలాఖరున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ . 
gunasekhar bahubali కోసం చిత్ర ఫలితం

కానీ ఈలోపే గుణ అస్వస్థత కు గురి అయ్యారని తెలిసి ఆందోళన పడుతున్నారు . దీంతో ఈ చిత్రం ఈనెలలో కూడా విడుదల కాదని ఆందోళన చెందుతున్నారు..మరి గుణశేఖర్ ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుందో .రుద్రమదేవి కి మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి.

పెళ్ళాం చికెన్ కూర చేయలేదని ....?


చికెన్ కోసం చిత్ర ఫలితం

ఈ స్పీడ్ యుగంలో ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరగడంతో చిన్నచిన్న విషయాలకే కోపోద్రిక్తులవుతున్నారు. ఆ కోపంలో వారు తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. చంపాలన్న కసో లేదంటే చచ్చిపోవాలన్నా కోపమో వస్తుంది. చేస్తున్నది తప్పో రైటో అని రెండు నిమిషాలు ఆలోచిస్తే.. అనర్ధాలు జరగవు. కాని, అలా ఆలోచించే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇక విషయానికి వద్దాం. చికెన్ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం భర్త ఫ్యాన్ ను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే…

కూకట్ పల్లిలోని రామకృష్ణా నగర్ లో నివాసం ఉండే కారు డ్రైవర్ మధు ఆదివారం రాత్రి సినిమా కు వెళ్లి వచ్చాడు. భార్యను వచ్చే సరికి చికెన్ తెచ్చి వండమని చెప్పాడట. కాని, భార్య ఆ పని చేయలేదు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం భార్య.. చికెన్ తెచ్చేందుకు బయటకు వెళ్ళింది. తిరిగి వచ్చే సరికి భర్త ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


కళ్ళుతిరిగి పడిపోయిన హన్సిక..! ఏమి చూసిందో ?

హన్సిక కోసం చిత్ర ఫలితం

షూటింగ్‌లో వున్నట్లుండి నటి హన్సిక కళ్ళు తిరిగిపడిపోయింది. దీంతో కంగారుపడిపోయిన సినిమా యూనిట్‌ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి లేకపోవడానికి తోడు. వెయిట్‌ తగ్గడం కోసం ఆమె చేస్తున్న డైటింగు కూడా ప్రభావం చూపిందని తేల్చిచెప్పారు. 

ఓ నాలుగు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు. బొద్దుగా వుండే హన్సిక ఇటీవలే నాజూగ్గా తయారుకావడానికి ఒళ్లు తగ్గించుకుంది. తమిళ సినిమా షూటింగ్‌లో వుండగా ఈ ఘటన జరిగింది.  

People Like Too Much