ప్రజలు " భక్తి" మార్గం .. యువరాజు "సెక్స్" మార్గం

సౌదీ అరేబియా యువరాజు మజెద్ అబ్దులజీజ్ అల్ సౌదీ ఓ సెక్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఆయనను లాస్ఏంజిలిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 1.98 కోట్ల రూపాయల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. 
 saudi prince
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... సౌదీ యువరాజు ఇటీవల లాస్ఏంజిలిస్‌కు వెళ్లి... బేవర్లీ హిల్స్ ఎస్టేట్‌లో బసచేశారు. ఆ ఎస్టేట్‌లో పని చేసే ఓ యువతిని చూసిన వెంటనే ఈయనకు కామోద్రేకం కలిగింది. ఇంకేముందు ఓ దేశానికి యువరాజునన్న గర్వంతో ఆయన ఆయువతిని తన గదికి పిలిచి.. ఓరల్ సెక్స్ చేయాలని బలవంతం చేశాడు. దీనికి యువతి సమ్మతించలేదు. 


అంతేకాకుండా యువరాజు చెర నుంచి ఏదోవిధంగా తప్పించుకుని గోడదూకి పారిపోయే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు చూసి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... సౌదీ యువరాజును అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, రూ.1.98 కోట్ల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

పవిత్రమైన మక్కా ఉన్న సౌదీ లో ఇలాంటి కామందులు ఉంటె జనాలు చావక ఇంకేం అవుతుంది. 


మాటల్లో చికెన్‌ బిర్యానీ... కడుపులోకి పిల్లి బిర్యానీ !

తక్కువ ధరకే చెన్నై నగరంలో చికెన్‌ బిరియాని లభిస్తుందని లొట్టలేసుకుంటూ తింటున్న మాంసాహార ప్రియులకు దిమ్మతిరిగిపోయే వార్త ఇది. బిరియానీ ఆర్డరిచ్చినప్పుడు ఆదమరచి తిన్నారా..? తరువాత కలలో కోడికి బదులు పిల్లి వస్తుంది. 
అవునండీ నిజం! చికెన్‌ బిరియానీ పేరుతో ‘పిల్లి మాంసం’తో వండిన బిరియానీ నగరంలో విక్రయిస్తున్నట్లు విస్మయాన్ని కలిగించే విషయం బయటపడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్లు, చిన్న టెంట్లను వేసుకుని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. ఇక్కడ శాకాహారంతోపాటు మాంసాహార వంటకాలు కూడా లభ్యమవుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల పక్కనే పొయ్యిలను ఏర్పాటుచేసి వంటలు తయారుచేస్తున్నారు. పాత్రలపై సరైన మూతలు పెట్టకపోవడంతో దుమ్ము, ధూళి కలవడం సరే, కోడి మాంసంతో పిల్లి మాంసాన్ని కలిపేసి బిరియానీ వండుతున్నారన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిజానికి ఈ దుకాణాలలో తక్కువ ధరలకు భోజనం లభిస్తుండడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంచార జాతుల ద్వారా పిల్లుల్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘శివగామి’ పైట లాగిన మోహన్ బాబు

బాహుబలిలో శివగామిగా కనిపించిన నటి రమ్యకృష్ణ. ఇపుడు ఈమె రొమాంటిక్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పేరు మామ మంచు అల్లుడు కంచు. అసలు డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అల్లరి మొగుడు’. 

వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్‌ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన వాటిలో ‘అల్లరి మొగుడు’కి ప్రముఖ స్థానమే ఉంటుంది. సిల్వర్‌జూబ్లి సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గుర్తుచేయడానికి కారణం ఉంది. మరోసారి మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ వెండితెరపైకి రానుంది. 

నువ్వు పడుకొని సంపాదిస్తే... మేము కూర్చుని తింటాం ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం వెలుగుచూసింది. తమ రక్తం పంచుకుని పుట్టిన కన్న కుమార్తెను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. అంతేనా ఆ యువతిని చిత్ర హింసలకు గురిచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 

మధ్యప్రదేశ్ రాష్ట్రం, బర్వాణీ జిల్లా, మహావీర్ నగర్‌కు చెందిన సంజయ్ శర్మ, నిర్మల అనే దంపతులకు 17 యేళ్ళ యువతి ఉంది. వీరు తమ కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దించేందుకు బలవంత పెట్టడమేకాకుండా, చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చారు. దీంతో ఆ యువతి వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దంపతులను అరెస్టు చేసింది. 

వీరిద్దరిపై హత్యా బెదిరింపు, దాడిచేయడం, సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ బాలిక గతంలో ఇండోర్‌లో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తుండగా, బలవంతంగా చదువు మాన్పించి బర్వాణీకి తీసుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ యువతి చాకచక్యంగా తమ బంధువులకు సమాచారం చేరవేసి.. తల్లిదండ్రుల నుంచి తప్పించుకుని మానప్రాణాలను కాపాడుకుంది. 

Related: 
1.మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

2.లక్షల్లో సైడ్ ఇన్ కమ్ సంపాదిస్తున్న హీరోయిన్లు

3.డబ్బు కోసం 15 ఏళ్ళ కూతురిని వ్యభిచారం లోకి దింపిన ...

4.రేణుదేశాయ్ సెకండ్ మ్యారేజ్

5.చిరంజీవి అయితే నాకేంటి ... నా రేటు మూడు కోట్లు ......






















రియల్ లైఫ్ లో దమ్ము కొట్టే అలవాటున్న హీరోయిన్ల లిస్ట్

సినిమాల్లో హీరో హీరోయిన్లు పొగతాగే సన్నివేశాలు మనం చూసే ఉంటాం. సినిమా స్టోరీ, పాత్ర తీరును బట్టి తెరపై ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అయితే కొందరు హీరోయిన్లకు నిజ జీవితంలోనూ స్మోకింగ్ అలవాటు ఉంది. అందులో కొందరిది దమ్ము కొట్టందే రోజు గడవని పరిస్థితి. పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ఈ లిస్టులో ఉన్నారు. 
riyal laiflo aa duralavaatunna hiroyinlu (foto

అయితే ఇందులో చాలా మంది సరదాగా ప్రారంభించి క్రమ క్రమంగా పొగత్రాగడానికి బానిసలైన వారే. ఇక సినిమా పరిశ్రమ అంటేనే ఒత్తిడితో కూడుకున్న లైఫ్ స్టైల్ ఉంటుంది. దీంతో సినిమా సెట్లో సైతం సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేహీరోయిన్ల సంఖ్య కూడా ఎక్కువే. ఫిల్మ్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం స్మోకింగ్ అలవాటు ఉన్న హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో.... రాణి ముఖర్జీ సిగరెట్ తాగే అలవాటు ఉన్న హీరోయిన్లలో రాణి ముఖర్జీ ఒకరు. పొద్దున్నే సిగరెట్ వెలిగించనిదే ఆమెకు రోజు మొదలు కాదట. సిగరెట్ మానేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె వల్ల కావడం లేదట. సుస్మితా సేన్ మాజీ మిస్ వరల్డ్ సుస్మితా సేన్ కు కూడా స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. పలు సందర్భాల్లో ఆమె పబ్లిక్ ప్లేసుల్లో  సిగరెట్ తాగుతూ ఫోటోలకు కెమెరాలకు చిక్కారు. కంగనా రనౌత్ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తెరపై నటించిన చాలా పాత్రల్లో స్మోకింగ్ చేస్తూ కనిపించింది.


 ఫ్యాషన్, తను వెడ్స్ మను, గ్యాంగ్‌స్టర్ లాంటి చిత్రాల్లో ఆమె స్మోక్ చేస్తూ కనిపించారు. వాస్తవం ఏమిటంటే ఆమె నిజ జీవితంలో చైన్ స్మోకర్. కొంకనా సేన్ మరో బాలవుడ్ నటి కొంకనా సేన్ కూడా రియల్ లైప్‌లో చైన్ స్మోకర్. గర్భం దాల్చినపుడు స్మోకింగ్‌కు దూరంగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మనీషా కొయిరాల ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మనీషా కొయిరాలకు మద్యం అలవాటుతో పాటు స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. నమిత దక్షిణాది భామ నమితకు కూడా నిజ జీవితంలో స్మోకింగ్ అలవాటు ఉందని, ఆమె స్మోకింగ్ వల్ల సెట్స్‌లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే వార్త అప్పట్లో చర్చనీయాంశం అయింది.

పబ్లిక్ గా రోడ్డు పై మూత్రం పోసిన మహిళ.... ఎందుకో ? - Video

ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో, ఫేస్ బుక లో ఒక వీడియో హల్ చల్ చేస్తుంది. మగవారు చేసే పని ఒక యువతి చేస్తే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో అందరికీ తెలిసి వచ్చేలా ఈ వీడియో చిత్రీకరంచారు..ఓ యువతి..పబ్లిక్ గా రోడ్డు ప్రక్కన మూత్రం పోసుకుంటున్న విషయం నమ్మలంటే కష్టమే. ఎందుకంటే మన దేశంలో సాధారణంగా మగవాళ్లు రోడ్డు
ప్రక్కన మూత్రం పోసుకుంటూ కనపిస్తుంటారు. ఇలా జరిగితే ...ఎలా సమాజం స్పందిస్తుంది అనేది ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.
roddu pakkane yuvati aa pani chestunte..kurrakaaru
అలా ఆ యువతి రోడ్డు పక్కన గొడల దగ్గర యూరిన్ పాస్ చేస్తుంటే..కొందరు ఈమె ఎవరా అని షాక్ అయ్యి చూసారు. మరి కొందరు ఆసక్తిగా ముందుకు వచ్చి చూసారు. ఇంకొకరు మరో అడుగు ముందుకు వేసి సెల్ తో వీడియో తీయటం మొదలెట్టారు. అంతేకానీ ఎవరూ కూడా ఇది తప్పు అని చెప్పిన పాపాన పోలేదు. అయితే ఇవన్నీ ఇలా ఉన్నా...ఒకరు మాత్రం ..ఓ రాయి తీసుకుని ఆమెపై విసిరారు. అప్పుడు ఓ యువకుడు వచ్చి ఆ యువకుడితో గొడవకు దిగుతాడు.. మొత్తానికి ఆడైనా,మొగైనా ఇలా రోడ్డు ప్రక్కన మూత్రం పోయిటం తప్పు అనే ఆలోచన ఉంది.

తెల్లగా ఉంటె ఆ యాడ్ చెయ్యాలా?

హీరోయిన్ తమన్నా... సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు నుండే మోడలింగ్, యాడ్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టింది. గతంలో ఆమె పెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ లో కూడా నటించింది. పాలరాతి బొమ్మలా మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా వెంట అప్పట్లో ఫెయినెస్ ప్రొడక్ట్స్ సంస్థలు వెంట పడేవి. అయితే ఇప్పుడు మాత్రం ఫెయిన్ నెస్ క్రీమ్ యాడ్స్ లో నటించే ప్రసక్తే లేదని అంటోంది. తనకు ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ యాడ్స్ మాత్రం చేయనంటోంది.

తమన్నా బొడ్డు కోసం చిత్ర ఫలితం

అసోంలో అద్బుతం ఆరునెలల్లో 85 మందికి జన్మనిచ్చిన మహిళ?

ఆరునెలల్లో 85మందికి జన్మనివ్వడమేమిటనుకుంటున్నారా..? సర్కారు సొమ్ముకోసం కక్కుర్తిపడి.. దవాఖానలో లెక్కలు తారుమారుచేసింది. అసోంలోని కరీంగంజ్ ప్రభుత్వ దవాఖానలోని మెటర్నిటీ జాబితాను ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. అందులో ఆరునెలల్లో 160 కాన్పులు జరిగినట్టు ఉంది. 85సార్లు లిలీ బేగం లష్కర్ అనే మహిళ పేరుంది. 

begum

ఆరునెలల్లో 85సార్లు ఆమె పిల్లలు కన్నట్టుగా ఉందన్నమాట. ఆశ్చర్యానికి గురైన అధికారులు.. ఆరా తీయగా, లిలీ బేగం అనే మహిళ కాన్పుల జాబితాను రూపొందించే నర్సు అని తేలింది. సర్కారు దవాఖానలో కాన్పు చేయించుకునే మహిళలకు ప్రభుత్వం రూ. 500చొప్పున అందజేస్తూ ఉంటుంది. ఆ డబ్బుకోసమే లిలీ బేగం.. తనపేరును జాబితాలో చేర్చినట్టు వెల్లడైంది. లిలీ బేగం అధికారులు సస్పెండ్ చేశారు.

ఈ వింత పూజని చూసారా..?

రోజురోజుకి టెక్నాలజీ పెరిగిన కానీ మారుమూల ప్రాంతం లో మాత్రం వింత వింత పూజలు, మంత్రాలు, దెయ్యాలు అనే వాటిని ప్రజలు ఇంకా నమ్ముతూనే ఉన్నారు..
Vintha-pooja
వాళ్ల నమ్మకాన్ని క్యాష్ చేసుకొని మంత్రగాళ్ళు తమ దోపిడీ కొనసాగిస్తున్నారు..తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ వింత పూజా ను చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారు..మీరు కూడా ఈ పూజా ఫై లుక్ వెయ్యండి.

మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

తాళం వేసితిని , గొళ్లెం మరచితిని అనే డైలాగ్ ను ఇక్కడ అన్వయించుకుంటే… ప్యాంట్ తొడిగితిని. బటన్, బెల్ట్ మరిచితిని అని చెప్పుకోవాల్సొస్తుంది ఆ మంత్రిగారి పరిస్థితి వివరిచాలంటే.  ఆయన ఓ దేశానికి మంత్రి , తన కార్ లో బయలు దేరేముందు ఓ గెస్ట్ ఆయన్ను కలవడానికి వచ్చారు. ఆ గెస్ట్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో మంత్రిగారి ప్యాంట్ కాస్తా పుటుక్కున కిందకు జారింది. 
ఇంకేముందు  అందరి ముందు మంత్రిగారి పరువు పోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.  మంత్రి గారు చూపించారు విశ్వరూపం అంటూ కింద కామెంట్ల వర్షం కురుస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూడండి. సూటూ. బూటు వేసుకోగానే సరిపోదు. బటన్ పెట్టుకున్నామా? బెల్ట్ పెట్టుకున్నామా? లేదా అని కూడా చూసుకోవాలి లేకుంటే సీన్ సితార.. పరువు బజార్ల అన్నట్టవుతుంది.

ఆ స్వామీజీ చెపారు... మొగుడ్ని దగ్గరకు రానివ్వద్దని...ఎందుకంటే ?

ముంబైలోని బాంద్రా సెషన్స్ కోర్టు తాజాగా.. భర్త కోరుకున్న విధంగా లైంగిక జీవితాన్ని అందించడంలో విఫలమైన భార్య చర్యలను తప్పుబడుతూ ఓ యువకుడికి విడాకులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ఈ కేసు వివరాలలోకి వెళితే, బాధిత యువకుడికి 2011లో వివాహం కాగా, సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కనాలని అనుకున్నాడు.

అయితే, అందుకు మాత్రం ఆమె నిరాకరించింది. తొలిరాత్రే పిల్లలు వద్దని ఆమె తెగేసి చెప్పిందట. ఈ క్రమంలో ఆమె ఓ స్వామీజీని తన గురువుగా భావించి అతడు చెప్పినట్లుగా వింటుందని సదరు భర్త తెలిపాడు. అంతేకాకుండా ఆమె చేష్టలకు విసిగిపోయి చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే, ఆమె మాత్రం కోర్టులో తన భర్త అసహజ శృంగారాన్ని కోరుతున్నాడని వాదించింది.

ఈ సందర్భంగా ఇరువురి వాదనలను విన్న కోర్టు.. ఆమె వాదన సరిగ్గా లేదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్ఏ మోరే.. ఈ కేసులో భర్త మానసిక వేదన కనిపిస్తోందని, ఆయన విడాకులు పొందేందుకు అర్హుడని అభిప్రాయపడ్డారు. అలాగే వివాహం చేసుకుని సుఖ పడాలన్న యువకుడి కోరికలు ఆమె వల్ల నిష్పలమయ్యాయని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె అతడ్ని మానసికంగా హింసకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.


ఆమె ధైర్యం చెప్పడం వల్లే ఆ ముద్దు సీన్ చేయగలిగాను...మెగా హీరో

లిప్ లాక్, హాట్ హాట్ సీన్స్ చేయడం బాలీవుడ్ లో చాల కామన్, హీరో అయిన హీరోయిన్ అయిన అలాంటి సన్నివేశాలను తేలికగా చేస్తారు..ఇప్పడు టాలీవుడ్ లో కూడా అదే ఫార్మాట్ ని వాడుతున్నారు. పెద్ద, చిన్న హీరోలను చూడడం లేదు, సినిమాలో కాస్త మసాలా ఘాటు ఎక్కువ ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తున్నారని తెలుసుకున్న డైరెక్టర్స్ అదే నమ్ముతున్నారు. 
sai dharam tej కోసం చిత్ర ఫలితం
మహేష్ బాబు , అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలు కూడా ముద్దు సీన్స్ కు ఒకే చెపుతున్నారు.. తాజాగా అలాంటి ముద్దు సీన్ చేసిటప్పుడు మెగా హీరో తెగ భయపడిపోయాడట..ఇంతకి ఆ హీరో ఎవరంటే సాయి ధరమ్ తేజ్..తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న ఈ యంగ్ హీరో , రెజినా తో ఓ ముద్దు సన్నివేషం షూట్ చేస్తున్నప్పుడు తెగ ఇబ్బంది పడ్డట..అప్పుడు అతగాడికి ధైర్యం చెప్పి ముద్దు సీన్ బాగా వచ్చేట్టు చేసిందట రెజినా..ఆమె ధైర్యం చెప్పడం వల్లే ఆ ముద్దు సీన్ చేయగలిగాను అని చెప్పాడు సాయి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది..

వెంక‌టేష్‌ కూతురుగా సమంత

టాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ రూపుదాల్చ‌డానికి రంగం సిద్థ‌మైంది. వెంక‌టేష్‌, స‌మంత ఓ సినిమాలో క‌ల‌సి న‌టిస్తున్నారు. జంట‌గా కాదు, తండ్రీ కూతుర్లుగా. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన పీకూ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా రైట్స్ ప్ర‌స్తుతం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద‌గ్గ‌రున్నాయి. 
venki kuturu.. samanta?
విజ‌య‌భాస్క‌ర్‌తో ఈ సినిమాని పునఃనిర్మించాల‌ని సురేష్‌బాబు నిర్ణ‌యించుకొన్నారు. బాలీవుడ్ లో అమితాబ్ పోషించిన పాత్ర‌లో వెంక‌టేష్ క‌నిపించ‌నున్నాడు. దీపికా ప‌దుకొనే పాత్ర‌లో స‌మంత న‌టించ‌నుంది. వెంకీతో క‌ల‌సి న‌టించ‌డానికి స‌మంత ఉత్సాహం చూపిస్తోంద‌ని, ఆ పాత్ర‌కు స‌మంత అయితేనే బాగుంటుంద‌ని సురేష్ బాబు భావిస్తున్నార‌ట‌. 

అయితే.. ఎంత ఏజ్ పెరిగినా ఇప్ప‌టికీ కుర్రాళ్లుగానే ఫీలైపోతుంటారు మ‌న హీరోలు. అలాంటిది తండ్రి పాత్ర‌కు వెంకీ ఒప్పుకొన్నాడంటే నిజంగా హ్యాట్రాఫ్ చెప్పాల్సిందే.

సన్నిలియోన్‌ వీడియో లీక్ ..

 ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు బాలీవుడ్‌ నటి సన్నిలియోన్‌ సిద్ధమవుతోంది. 'లవ్‌ యూ ఆలియా'లో ఆమె ప్రత్యేక పాటలో కనిపించనుంది.కామాక్షి...కామాక్షి అంటూ సాగ్ ఈ పాట చిత్రీకరణకు రూ.కోటికి పైగా వ్యయం అయినట్లు సమాచారం. 

ఈ పాట కంప్లీట్ ఎడిటెడ్ వెర్షన్ యూ ట్యూబ్ లో లైకై పోయంది. నిర్మాతలు ఈ పాటను ప్రోమో కట్ చేసి వదిలి ప్రాజెక్టు కు క్రేజ్ తెచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ లోగా ఈ దారణం జరిగింది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు దాంతో దర్శక,నిర్మాతలు షాక్ కు గురి అయ్యారు. వారు పోలీస్ లను ఆశ్రయించారు. పోలీస్ లు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. 
sanniliyon vidiyo lik ..polis kamplaint
దర్శకుడు ఇంద్రజిత్..ముందుగా సాంగ్ లను యూ ట్యూబ్ లో విడుదల చేయటానికి ఇష్టపడలేదు. అవి తెరమీద చూస్తేనే ఎంజాయ్ చేస్తారని ఆయన భావించారు. అయితే ఈ లోగా ఇలా జరిగిపోయింది. అప్పటికీ ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా టైట్ సెక్యూరిటీని పెట్టించారు దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్. సంజయ్ ఖాన్ రిసార్ట్ లో షూటింగ్ జరిగింది. ఈ చిత్రంలో క్రేజీస్టార్‌ రవిచంద్రన్‌, భూమికా జంటగా నటించారు. 

ఇంద్రజిత్‌ లంకేష్‌ ఈ సినిమాకు దర్శకుడు. సన్ని ఈ చిత్రంలో ఓ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది . లవ్ యూ ఆలియా అనే ఈ కన్నడ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో తళుక్కుమననుంది సన్ని. అయితే.. సాండల్ వుడ్ సూపర్ స్టార్ సుదీప్ కూడా ఈ చిత్రంలోని ఓ పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడట. అయితే సన్నీ, సుదీప్ కు కలిపి ఏ సన్నివేశాలు లేవట. ఓ యంగ్ హీరో సరసన కామాక్షీ అనే పాటలో చిందేయనుంది ఈ పోర్న్ బ్యూటీ. ఇక ఇటీవలే బాలీవుడ్ లో ఏక్ పహేలీ లీలా సినిమాలో అమ్మడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేయడంతో.. ఈ ఐటమ్ సాంగ్ ను మరింత కేర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట.

ఆపుకోలేక : న్యూడ్ ఫొటో షేర్ చేసిన పూరీ జగన్నాథ్ (ఫొటో)

తనను తాను ఎక్సప్రెస్ చేసుకోవటంలో ఎప్పుడు సిగ్గుపడటానికి ఇష్టపడని దర్శకుడు పూరి జగన్నాధ్. 

ఆయన తాజాగా ఓ మోడల్ న్యూడ్ ఫొటో ట్విట్టర్ లో షేర్ చేసి అందరినీ షాక్ చేసారు.
/puri-jagan-can-t-resist-sharing-nude-pic కోసం చిత్ర ఫలితం

నా భార్య చెప్పింది ఆ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ వద్దని : మహేష్ బాబు- ఎవరా హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ కి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చేకొని ఆ తర్వాత మాస్ ఇమేజ్ తో ఇండస్ట్రీ లో నెంబర్ వన్ గా దూసుకపోతున్నాడు..ప్రస్తుతం శ్రీమంతుడు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ , ఓ హీరోయిన్ తో లిప్ లాక్ చేయడానికి నో చెప్పాడు..ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో మీరే చూడండి.. "దూకుడు ", " సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో మహేష్ కు జోడిగా నటించిన సమంత తో ముచ్చటగా మూడో సారి "బ్రహ్మోత్సవం " చిత్రం తో మళ్లీ ఒకటవుతున్నారు.. 
mahesh babu lip lock కోసం చిత్ర ఫలితం
కాగా మహేష్ - సమంతలపై ఓ ఫ్రెంచ్ కిస్ ని ప్లాన్ చేసాడట దర్శకులు శ్రీకాంత్ అడ్డాల కాగా ఆ రొమాంటిక్ సీన్ గురించి మహేష్ కు చెప్పినప్పుడు అలాంటి లిప్ లాక్ వద్దని చెప్పాడట మహేష్ . తనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దో అంటూ చెప్పాడట. కానీ దీనివెనుక నమృత హస్తం ఉందని ఆమె ఒప్పుకోకపోవడం తోనే మహేష్ లిప్ లాక్ చేయనని చెప్పాడనే టాక్ వినిపిస్తుంది.

ఒకే ఒక్క కాల్ తో.. ఒకేసారి వంద మందితో.. ఉచితంగా!

ఇంటర్నెట్ ప్రపంచంలో సామాజిక మాధ్యమాల కారణంగా ఈ ప్రపంచం కుగ్రామంగా మారిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా వేదికల మధ్య కూడా విపరీతమైన పోటీ ఉండడంతో, ప్రతీ వేదిక రోజుకో కొత్త ఆలోచనలతో సోషల్ మీడియా ప్రేమికులను ఆకర్షిస్తుంది.
hike1
తాజాగా ప్రముఖ సామాజిక వేదిక హైక్ మెసెంజర్ సరికొత్త అవకాశాన్ని మొబైల్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. హైక్ ఇప్పటివరకు మెస్సెంజర్ గా పనిచేయగా, ఇప్పుడు ఉచిత గ్రూప్ కాల్ కూడా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒకే ఒక్క కాల్ తో ఏకంగా ఒకేసారి వంద మందితో ఉచితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తూ సేవలు ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయాన్ని తాజాగా హైక్ మెస్సేంజర్ యజమాని, టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ తనయుడు కెవిన్ మిట్టల్ ప్రారంభించారు. అయితే, ఈ సేవలు ప్రస్తుతానికి 4జీ, వైఫై ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లకు అందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికల్లా ఐవోఎస్, విండోస్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

అవకాశాలు లేక రోడ్డున పడ్డ ముమైత్ ఖాన్



పోకిరి చిత్రంతో పోకిరిగాళ్ల గుండెల్లో గిటారు మోగించిన ముమైత్ ఖాన్ అంటే అప్పట్లో ఓ క్రేజ్. ఈ సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది అమ్మడు. ఆ తర్వాత ఐటమ్ పాటలకు కెరాఫ్ అడ్రస్ గా మారిన ముమైత్ కు, ప్రస్తుతం అవకాశాలు తగ్గడమో.. లేక ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా రోడ్డు పై పడింది.
 
రోడ్డున పడిందంటే ఇంకేదో అయ్యిందనుకునేరు. ఏమి అవ్వలేదు లేండీ. ముమైత్ ఖాన్ రీసెంట్ గా లాంగ్ డ్రైవ్ చేయాలనుందని తన మనసులో మాటను బయట పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం యు.ఎస్.లో ఉన్న ముమైత్, ఫిలడెల్ఫియా నుండి ఫ్లోరిడాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తంపా బే కు బయలుదేరిందట. అంతేకాదు ప్రయాణంలో తన మ్యూజిక్ తో కనువిందు చేయనుందట ఈ హాట్ భామ.

ఇటీవలె 'అడిక్షన్' అనే ఆల్బమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ముమైత్, తనలోని మ్యూజిక్ సెన్స్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసమే ఈ లాంగ్ డ్రైవ్ అట. దాదాపు 22 రోజుల పాటు సాగే వెయ్యి మైళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక చోట్ల ముమైత్ మ్యూజిక్ ఫెస్టివల్స్ లో పాల్గొనబోతోందట. దీంతో ముమైత్ రియల్ లైఫ్ లో కూడా ఆడియెన్స్ ను తన ఆట, పాటలతో షేక్ చేయబోతోందన్న మాట.


ఫంక్షన్ లో డ్రస్సు జారిపోయి ఆ కుర్ర హీరోయిన్ కష్టాలు.... ఫొటోస్

హాలీవుడ్ కుర్ర బ్యూటీ, పాప్ సింగర్ సెలీనా గోమెజ్ తన తాజా సినిమా షూటింగులో ఇబ్బంది కర పరిస్థితి ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమె 'నైబర్స్ 2' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అట్లాంటాలో జరుగుతోంది. షూటింగులో భాగంగా ఆమె స్ట్రాప్‌లెస్ పిక్ టీనీ మిని డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్సులో ఎంతో అందంగా మెరిసిపోయిన సెలీనా గోమెజ్... డ్రెస్ తన ఎద అందాలమీద నుండి జారి పోతుంటే ఇబ్బంది పడింది. 
ayyo dressu jaarutondi: ibbandi padda kurrabyuti
జారిపోతున్న తన డ్రెస్సును సవరించుకుంటూ ఈ అమ్మడు మరింత అందంగా వెలిగి పోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇపుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. 23 ఏళ్ల సెలీనా గోమెజ్ ఈ మధ్య తరచూ తన హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోతతో వార్తల్లో వ్యక్తిగా మారుతోంది. 'ఫ్రీ నిప్పల్' కాంపెన్ పేరుతో పలువురు తమ బోల్డ్ స్టైల్ స్టేట్మెంట్ ద్వారా పబ్లిసిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిసిటీ పెంచుకోవడానికి సెలీనా గోమెజ్ కూడా ఇలాంటి గిమ్మిక్స్ ప్లేచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ.. ఆ మధ్య న్యూయార్కులోని ఓ వీధిలో సెలీనా గోమెజ్ బ్రా లేకుండా హాట్ అవతారంలో దర్శనమిచ్చింది. 
ayyo dressu jaarutondi: ibbandi padda kurrabyuti
ఓ సారి కాలిఫోర్నియాలోని ఓ కేఫ్ లో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చిన సెలీనా బ్రా లేకుండా కనిపించారు. మరో సందర్భంలో సెలీనా గోమెజ్ బ్రా ధరించకుండా ఉల్లి పొరలాంటి డ్రెస్సులో దర్శనమిచ్చి అభిమానులను టెమ్ట్ చేసింది.

అనుష్క ఆడతనం... ప్రభాస్ - అనుష్క రొమాన్స్, బాహుబలి పార్ట్‌2లో వెరీ హాట్...

తెలుగు సినిమా తిరిగితిరిగి రాజమౌళి దగ్గరకే వస్తుంది. బాహుబలిలో ఆయన చేసిన పబ్లిసిటీ వల్ల మూడింతలు లాభం వచ్చేసింది. అందులో ఓ సన్నివేశం అభ్యంతరకరంగా వుందని పలువురు రాజమౌళికి సూచించారు కూడా. ప్రభాస్‌, తమన్నాలపై చిత్రీకరించిన 'పచ్చబొట్టేసినా..' పాట చిత్రీకరణలో ఇద్దరిపై వేసిన శ్రుంగార సన్నివేశాలు అభ్యంతరకరంగా మారాయి. ఆమె దుస్తులు విప్పడానికి ప్రభాస్‌ చేసిన టెక్నిక్‌ రాజమౌళి బుర్ర లోంచి వచ్చినవే.
Anushka

హీరోయిన్ల చేత ఎక్స్‌పోజ్ చేసే విషయంలో లిబరల్‌గా వుండే రాజమౌళి.. కేవలం ఆమెను ఆడపిల్ల అనే విషయాన్ని చెప్పడానికే అలా చేశానని తర్వాత చెప్పాడు కూడా. అందులో రాత్రి గడిపినట్లుగా చూపించాడు. ఇక రెండో పార్ట్‌లో అంతకంటే బాగానూ, అసభ్యకరంగా వుండకుండా అనుష్కపై సీన్లను చూపించేందుకు కసరత్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

మొదటిపార్ట్‌ లోనే భల్లాలదేవ.. దేవసేన(అనుష్క)ను ఇప్పటికైనా మనస్సు మార్చుకుని నాతో గడపు అంటాడు. ఈ కాస్పెప్ట్‌లే చిత్ర కథకు మూలం. రెండోభాగంలో దేవసేను, సీనియర్‌ బాహుబలి ప్రేమించి.. రాజుల తరహాలో జతకలిసే సన్నివేశం వుందనీ, అది చిత్రానికి హైలైట్‌గా వుంటుందనీ, ఇదంతా ఇప్పటి యూత్‌ను ఆకట్టుకునేందుకేనని చిత్ర యూనిట్‌ సమర్థిస్తూ చర్చించుకుంటుంది. సో.. ఇప్పటికే.. ఫస్ట్‌పార్ట్‌లో ఏముంది.. అంటూ ప్రతివాడూ చూసిన సినిమా కోట్లకుకోట్లకు గుమ్మరిస్తే.. ఇందులో ఇంకేదో వుందని మరో పబ్లిసిటీతో క్యాష్‌ చేసుకుంటున్నాడన్నమాట. దటీజ్‌.. రాజమౌళి.

తాప్సీ చెల్లి కొత్త బిజెనెస్‌ పెట్టింది

హీరోయిన్లందరూ కొత్త కొత్త బిజెనెస్‌లు పెడుతున్నారు. కేవలం హీరోయిన్‌గా, నటిగా ఎక్కువ కాలం కొనసాగలేం అనే ఫ్యాక్టును తెలుసుకుని, మన భామలు ఏదో ఒక సైడ్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేసుకుంటున్నారు. తమన్నా, కాజల్‌ నగల దుకాణాలు తెరిస్తే.. ఇలియానా మాత్రం బట్టల షాప్‌ పెట్టి చేతులు కాల్చుకుంది. 
తాప్సీ చెల్లి కొత్త బిజెనెస్‌ పెట్టింది
ఇప్పుడిక తాప్సీ కూడా వెడ్డింగ్‌ ప్లానర్‌ అవతారమెత్తి, తన చెల్లి షగున్‌, మరో స్నేహితురాలితో కలసి ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని పెట్టింది. అది చాలదన్నట్లు ఇప్పుడు తాప్సీ చెల్లి షగున్‌ మరో ఆన్‌లైన్‌ సేల్‌ పెట్టింది. ''ది జంక్‌యార్డ్‌ ఆన్‌లైన్‌ సేల్‌'' పేరుతో మనోళ్ళు ఇప్పుడు వాడేసిన ఆభరణాలు, మరియు ఇతర ఫ్యాషన్‌ యాక్సెసరీలను అమ్ముతారట.

చిరంజీవి సినీ జీవితంలో తీరని కోరిక ఏమిటంటే?

చిరంజీవి తన సినీ జీవితంలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసారు. అయితే ప్రతి నటుడి జీవితంలో కొన్ని కొన్ని రకాల పాత్రలు చేయలేక పోయానే అనే వెలితి ఉన్నట్లే చిరంజీవి నట జీవితంలో కూడా అలాంటి వెలితి ఉందట. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందిస్తూ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నా కెరీర్ లో ఎన్నో రకాల పాత్రల్లో కనిపించినా 'భగత్ సింగ్'గా కనిపించాలన్న కోరిక నెరవేరనేలేదు. అందుకే ఏదో ఒకనాడు నేను దేశభక్తుని పాత్రలో నటించాలనుకుంటున్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర లాంటివి చేస్తానని అన్నారు. 
chiru కోసం చిత్ర ఫలితం
అది 151వ సినిమా కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు అని వెల్లడించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయాలనుకున్న ఆటో జానీ సినిమా మధ్యలోనే ఆగిపోయినా... తన జీవితంలో ఆటో జానీ మూమెంట్స్ ఉన్నాయంటున్నారు. 'నా కాలేజీ రోజుల్లో ఎన్.సి.సి క్యాడెట్ ఉన్న రోజులవి. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ముందు పోతురాజు పోలేరమ్మ నాటకం వేస్తున్నాం. 

ఒక అమ్మాయి పోలేరమ్మ క్యారెక్టర్ చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను నా చేతులతో ఎత్తుకుని ఆటో దగ్గరికి తీసుకెళ్లాను. ఆటో డ్రైవర్ లేక పోవడంతో నేనే ఆటో నడుపుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాను. సమయానికి తీసుకెళ్లిన నన్ను డాక్టర్లు అభినందించారు. అది నా జీవితంలో ఆటో జానీ మూమెంట్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు

అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది...?

అమ్మాయిల మెంటాలిటీ కోసం చిత్ర ఫలితం
అమ్మాయిల మెంటాలిటీ : 
* ఇంకో అమ్మాయి అందం గురించి వినడానికి ఇష్టపడరు.
* వారి పట్ల క్రేజీగా ఉండాలి గాని, వారిని డిస్టర్బ్ చేయకూడదు.
* వారి అందం గురించి పొగిడినా ఒప్పుకుంటారు కానీ విమర్శలు ఒప్పుకోరు. 
* సెన్సాఫ్ హ్యూమర్ తో చెప్పిన నిజాలు కూడా భవిష్యత్తులో ఆయుధాలుగా వాడుతారు.
* వారు బాలేరన్న మాట కంటే వారి డ్రెస్ బాలేదన్న మాటే వారిని ఎక్కువ బాధిస్తుంది.
* అమ్మాయిలు నిజాలు వినాలనే కోరుకుంటారు. కానీ అబద్ధాలకు ఆకర్షితులవుతారు.

అమ్మాయిలతో స్నేహం..... రెండు దశలు....

అమ్మాయిలతో స్నేహం రెండు దశలలో ఉంటుంది. మొదటిది, పెళ్ళికి ముందు దశ, ఈ దశలో అమ్మాయి చాల సరదాగా ఉంటూ స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తూ, అవసరమయినప్పుడు సలహాలు, సూచనలు, సాయం చేస్తూ ఉంటుంది. సమాజపు అదృష్యపు కంచెలు తెంచుతూ ఆకాశం లో స్వేచ్చగా ఎగురుతున్న పక్షిలా, స్నేహానికి ఉన్న విలువలను కాపాడుతూ స్నేహం అన్న పదానికి ప్రతిరూపంగా ఉంటుంది.

పెళ్లి తరువాతి దశలో, అదే అమ్మాయి, అదే స్నేహితున్ని కలిసినప్పుడు ఒక పరిచయస్తునితో మాట్లాడినట్లు మాట్లాడుతుంది తప్ప ఒక సేన్హితునితో మాట్లాడినట్లు మాట్లడదు. మాటల్లో ఎక్కడో కృత్రిమత్వం వచ్చేస్తుంది. ఆమె నవ్వే ఆ నవ్వు కూడా సహజంగా ఉండదు. అంతకు ముందు వ్యక్తిగత, భావ ప్రకటనా స్వేచ్చా ఆలోచనలలో ఉన్న అమ్మాయి, పెళ్లి అయ్యాక, తనను బాగా అర్థం చేసుకొనే భర్త   దొరికినప్పటికీ తన ప్రవర్తనా సరళిలో గణనీయమైన మార్పు వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, సినిమాలో ఉండే కాలేజీ చలాకి అమ్మాయి, టీవి సీరియల్ ఆంటీలా తయారవుతుంది. పెళ్లి తరువాత ఇలానే ఉండాలి అన్న స్టీరియో టైప్ మెంటాలిటీ వారిని అలా ఉండేలా చేస్తుందేమో!


బాహుబలి లో ప్రభాస్ చేసినట్టు చేయబోయి....?

బాహుబలి సినిమాలో ప్రభాస్ చేసిన సాహసాలు రియల్ లైఫ్ లో చేయడానికి ప్రయత్నించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇది. కరీంనగర్ జిల్లాకు చెందిన షబ్బీర్, పెద్దపల్లి లోని గట్టు సింగారం జలపాతాలను చూడడానికి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. స్నేహితుల ముందు ఫీట్స్ ను చేస్తూ ఒక్కసారిగా అక్కడి నుండి జారి పడి మరణించాడు. 
bahubali prabhas jump hills కోసం చిత్ర ఫలితం
బాహుబలి సినిమాలో ప్రభాస్ కొండలను ఎక్కే సీన్లను, తర్వాత ధీవరా మేకింగ్ వీడియో ను కూడా చూపించారు. పిట్టగోడంత ఉన్న వాడినే గ్రాఫిక్స్ సహాయంతో అలా చూపించారని క్లియర్ గా తెలిసిపోతోంది. 

దానిని చూసి కూడా కుర్రకారు ఇలా ప్రయత్నించడం అవివేకం. గతంలో కూడా స్పైడర్ మ్యాన్, శక్తిమ్యాన్ ను ప్రేరణగా తీసుకొని చాలా మంది కుర్రాళ్లు బిల్డింగ్ ల మీది నుండి దూకి చనిపోయారు. 

People Like Too Much