అవకాశాలు లేక రోడ్డున పడ్డ ముమైత్ ఖాన్



పోకిరి చిత్రంతో పోకిరిగాళ్ల గుండెల్లో గిటారు మోగించిన ముమైత్ ఖాన్ అంటే అప్పట్లో ఓ క్రేజ్. ఈ సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది అమ్మడు. ఆ తర్వాత ఐటమ్ పాటలకు కెరాఫ్ అడ్రస్ గా మారిన ముమైత్ కు, ప్రస్తుతం అవకాశాలు తగ్గడమో.. లేక ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా రోడ్డు పై పడింది.
 
రోడ్డున పడిందంటే ఇంకేదో అయ్యిందనుకునేరు. ఏమి అవ్వలేదు లేండీ. ముమైత్ ఖాన్ రీసెంట్ గా లాంగ్ డ్రైవ్ చేయాలనుందని తన మనసులో మాటను బయట పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం యు.ఎస్.లో ఉన్న ముమైత్, ఫిలడెల్ఫియా నుండి ఫ్లోరిడాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తంపా బే కు బయలుదేరిందట. అంతేకాదు ప్రయాణంలో తన మ్యూజిక్ తో కనువిందు చేయనుందట ఈ హాట్ భామ.

ఇటీవలె 'అడిక్షన్' అనే ఆల్బమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ముమైత్, తనలోని మ్యూజిక్ సెన్స్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసమే ఈ లాంగ్ డ్రైవ్ అట. దాదాపు 22 రోజుల పాటు సాగే వెయ్యి మైళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక చోట్ల ముమైత్ మ్యూజిక్ ఫెస్టివల్స్ లో పాల్గొనబోతోందట. దీంతో ముమైత్ రియల్ లైఫ్ లో కూడా ఆడియెన్స్ ను తన ఆట, పాటలతో షేక్ చేయబోతోందన్న మాట.


People Like Too Much