చిరంజీవి సినీ జీవితంలో తీరని కోరిక ఏమిటంటే?

చిరంజీవి తన సినీ జీవితంలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసారు. అయితే ప్రతి నటుడి జీవితంలో కొన్ని కొన్ని రకాల పాత్రలు చేయలేక పోయానే అనే వెలితి ఉన్నట్లే చిరంజీవి నట జీవితంలో కూడా అలాంటి వెలితి ఉందట. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందిస్తూ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నా కెరీర్ లో ఎన్నో రకాల పాత్రల్లో కనిపించినా 'భగత్ సింగ్'గా కనిపించాలన్న కోరిక నెరవేరనేలేదు. అందుకే ఏదో ఒకనాడు నేను దేశభక్తుని పాత్రలో నటించాలనుకుంటున్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర లాంటివి చేస్తానని అన్నారు. 
chiru కోసం చిత్ర ఫలితం
అది 151వ సినిమా కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు అని వెల్లడించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయాలనుకున్న ఆటో జానీ సినిమా మధ్యలోనే ఆగిపోయినా... తన జీవితంలో ఆటో జానీ మూమెంట్స్ ఉన్నాయంటున్నారు. 'నా కాలేజీ రోజుల్లో ఎన్.సి.సి క్యాడెట్ ఉన్న రోజులవి. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ముందు పోతురాజు పోలేరమ్మ నాటకం వేస్తున్నాం. 

ఒక అమ్మాయి పోలేరమ్మ క్యారెక్టర్ చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను నా చేతులతో ఎత్తుకుని ఆటో దగ్గరికి తీసుకెళ్లాను. ఆటో డ్రైవర్ లేక పోవడంతో నేనే ఆటో నడుపుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాను. సమయానికి తీసుకెళ్లిన నన్ను డాక్టర్లు అభినందించారు. అది నా జీవితంలో ఆటో జానీ మూమెంట్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు

People Like Too Much