'బెంగాల్ టైగర్' సినిమా రివ్యూ

 బెంగాల్ టైగర్ రివ్యూ కోసం చిత్ర ఫలితం

                 ఊళ్లో మంచి పనులు లాంటి జులాయి పనులు చేస్తూండే రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలాంటి కుర్రాడు ఆకాష్ నారాయణ్(రవితేజ). అతను ఓ పెళ్లి చూపులకు వెళితే..అక్కడ పెళ్లి కూతురు(అక్ష) తను ఫేమస్ అయిన వాడినే చేసుకుంటానని రిజెక్టు చేస్తుంది. దాంతో హఠాత్తుగా ఫేమస్ అయిపోవాలని ఫిక్స్ అయిన ఆకాష్...తమ ఊరికి వచ్చిన అగ్రికల్చర్ మినిస్టర్(షాయేజి షిండే)ని రాయితో కొట్టి మీడియాకు ఎక్కుతాడు. అయితే ఫేమస్ అవటం కోసం చాలా ధైర్యంతో మినిస్టర్ ని కొట్టిన విధానం నచ్చిన మినిస్టర్ అతన్ని తన అనుచరుడుగా పెట్టుకుంటాడు. (ఫేమస్ అవటం కోసం రాయితో కొట్టడమేంటి..వాడికి ఏమన్నా పిచ్చా లేక..తింగరా అని ఆలోచించడు మినిస్టర్...ఇక్కడ దర్శకుడు ...పొలిటీషన్స్ కు బుర్ర ఉండదు అనే విషయాన్ని చక్కగా చెప్పాడు) అక్కడ నుంచి అతన్ని హోం మినిస్టర్ నాగప్ప (రావురమేష్ )కి పరిచయం చేస్తాడు.

బెంగాల్ టైగర్ రివ్యూ కోసం చిత్ర ఫలితం

హోం మినిస్టర్..తన కూతురు శ్రద్ధ(రాశీ ఖన్నా)కి బాడీ గార్డ్ గా ఆకాష్ ని నియమిస్తాడు. (అదేంటి తన కూతురుకే సెక్యూరిటీ ఇవ్వలేనివాడు హోం మినిస్టర్ ఏంటి...రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అతని చేతులో ఉంటుంది కదా అనకండి..అతనికి ఆ టైమ్ లో అది గుర్తుకు రాకపోయి ఉండవచ్చు). అక్కడ నుంచి మన హీరో ఆకాష్ ...హోం..కూతురుని ప్రేమలో పడేసి, పెళ్లి దాకా తెస్తాడు. పెళ్లి విషయాన్ని ఎనౌన్స్ చేద్దామనుకున్న సమయంలో ...అతను దానికి నో చెప్పి..తాను సిఎం సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు ఆకాష్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా కేవలం తను ఫేమస్ అవ్వడం కోసమే చేసాడా? లేక దీని వెనుక ఏదన్నా గతం ఉందా? ఉంటే అదేంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

People Like Too Much