ఆ స్వామీజీ చెపారు... మొగుడ్ని దగ్గరకు రానివ్వద్దని...ఎందుకంటే ?

ముంబైలోని బాంద్రా సెషన్స్ కోర్టు తాజాగా.. భర్త కోరుకున్న విధంగా లైంగిక జీవితాన్ని అందించడంలో విఫలమైన భార్య చర్యలను తప్పుబడుతూ ఓ యువకుడికి విడాకులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ఈ కేసు వివరాలలోకి వెళితే, బాధిత యువకుడికి 2011లో వివాహం కాగా, సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కనాలని అనుకున్నాడు.

అయితే, అందుకు మాత్రం ఆమె నిరాకరించింది. తొలిరాత్రే పిల్లలు వద్దని ఆమె తెగేసి చెప్పిందట. ఈ క్రమంలో ఆమె ఓ స్వామీజీని తన గురువుగా భావించి అతడు చెప్పినట్లుగా వింటుందని సదరు భర్త తెలిపాడు. అంతేకాకుండా ఆమె చేష్టలకు విసిగిపోయి చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే, ఆమె మాత్రం కోర్టులో తన భర్త అసహజ శృంగారాన్ని కోరుతున్నాడని వాదించింది.

ఈ సందర్భంగా ఇరువురి వాదనలను విన్న కోర్టు.. ఆమె వాదన సరిగ్గా లేదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్ఏ మోరే.. ఈ కేసులో భర్త మానసిక వేదన కనిపిస్తోందని, ఆయన విడాకులు పొందేందుకు అర్హుడని అభిప్రాయపడ్డారు. అలాగే వివాహం చేసుకుని సుఖ పడాలన్న యువకుడి కోరికలు ఆమె వల్ల నిష్పలమయ్యాయని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె అతడ్ని మానసికంగా హింసకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.


People Like Too Much