అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది...?

అమ్మాయిల మెంటాలిటీ కోసం చిత్ర ఫలితం
అమ్మాయిల మెంటాలిటీ : 
* ఇంకో అమ్మాయి అందం గురించి వినడానికి ఇష్టపడరు.
* వారి పట్ల క్రేజీగా ఉండాలి గాని, వారిని డిస్టర్బ్ చేయకూడదు.
* వారి అందం గురించి పొగిడినా ఒప్పుకుంటారు కానీ విమర్శలు ఒప్పుకోరు. 
* సెన్సాఫ్ హ్యూమర్ తో చెప్పిన నిజాలు కూడా భవిష్యత్తులో ఆయుధాలుగా వాడుతారు.
* వారు బాలేరన్న మాట కంటే వారి డ్రెస్ బాలేదన్న మాటే వారిని ఎక్కువ బాధిస్తుంది.
* అమ్మాయిలు నిజాలు వినాలనే కోరుకుంటారు. కానీ అబద్ధాలకు ఆకర్షితులవుతారు.

అమ్మాయిలతో స్నేహం..... రెండు దశలు....

అమ్మాయిలతో స్నేహం రెండు దశలలో ఉంటుంది. మొదటిది, పెళ్ళికి ముందు దశ, ఈ దశలో అమ్మాయి చాల సరదాగా ఉంటూ స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తూ, అవసరమయినప్పుడు సలహాలు, సూచనలు, సాయం చేస్తూ ఉంటుంది. సమాజపు అదృష్యపు కంచెలు తెంచుతూ ఆకాశం లో స్వేచ్చగా ఎగురుతున్న పక్షిలా, స్నేహానికి ఉన్న విలువలను కాపాడుతూ స్నేహం అన్న పదానికి ప్రతిరూపంగా ఉంటుంది.

పెళ్లి తరువాతి దశలో, అదే అమ్మాయి, అదే స్నేహితున్ని కలిసినప్పుడు ఒక పరిచయస్తునితో మాట్లాడినట్లు మాట్లాడుతుంది తప్ప ఒక సేన్హితునితో మాట్లాడినట్లు మాట్లడదు. మాటల్లో ఎక్కడో కృత్రిమత్వం వచ్చేస్తుంది. ఆమె నవ్వే ఆ నవ్వు కూడా సహజంగా ఉండదు. అంతకు ముందు వ్యక్తిగత, భావ ప్రకటనా స్వేచ్చా ఆలోచనలలో ఉన్న అమ్మాయి, పెళ్లి అయ్యాక, తనను బాగా అర్థం చేసుకొనే భర్త   దొరికినప్పటికీ తన ప్రవర్తనా సరళిలో గణనీయమైన మార్పు వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, సినిమాలో ఉండే కాలేజీ చలాకి అమ్మాయి, టీవి సీరియల్ ఆంటీలా తయారవుతుంది. పెళ్లి తరువాత ఇలానే ఉండాలి అన్న స్టీరియో టైప్ మెంటాలిటీ వారిని అలా ఉండేలా చేస్తుందేమో!


People Like Too Much