భర్తకు భార్య రాఖీ కట్టవచ్చట..

భర్తకు భార్య రాఖీ కట్టవచ్చట.. ఆశ్చర్యపోకండి .ఇది  ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు.. పురాణాల్లో సైతం  ఉన్న విషయమే. అసలు రాఖీ అంటే రక్షణ బంధం. నేను నీకు రక్షగా ఉంటా అనే అభయం. అలాంటప్పుడు భార్యకు భర్తను మించిన రక్షణ ఎక్కడ ఉంటుంది. అందుకే భర్తకు భార్య రాఖీ కట్టవచ్చంట. ఇక విషయాన్ని  పురాణాల్లోకి  తీసుకెళ్లి చెప్పాలంటే….


raksha bandhan కోసం చిత్ర ఫలితం
రాక్షసులకు, దేవతలకు మధ్య బీకరపోరు జరిగింది. ఈ పోరులో రాక్షసుల పరాక్రమాన్ని చూసి తన రాజ్యాన్ని కోల్పోతానేమోనని దేవతల రాజు దేవేంద్రుడు భయాందోళనకు గురై యుద్ధానికి వెళ్లకండా ఇంట్లోనే ఉండిపోతాడు. తన భర్త విజయం సాధించాలని భార్య శచీదేవి ఇంద్రుడి చేతికి  పూజించిన ఒక ధారాన్ని  కడుతుంది. దీంతో ఇంద్రుడు ఆ యుద్దంలో సాధిస్తాడు.

రాఖీ పండుగకు దీన్ని కూడా ఓ కథనంగా చెబుతారు మన పెద్దలు.  కేవలం రాఖీ కట్టించుకొని.. కట్టిన వారి చేతిలో మనకు తోచినంత డబ్బు చేతిలో పెట్టగానే మన బాధ్యత తీరిపోదు. కష్ట సుఖాల్లో వాళ్లకు రక్షణగా ఉండాలి. Happy Raksha Bandan. 

People Like Too Much