భోజనం తర్వాత ఇవి చేయకండి.!

 ఉదయం టిఫిన్, రెండు పూటల భోజనం ఇది మన సాధారణ దినచర్యలో భాగం. పప్పు, ఆవకాయో, బెండకాయ ప్రైతోనో, లేకపోతే చికెన్ మటన్ లతోనో పుష్టుగా భోజనం చేసేస్తాం.. తిండి వరకు ఓకే కానీ తిన్న తర్వాత వెంటనే కొన్ని చేయకూడనివి ఉంటాయని మనకు అంతగా తెలియదు.. వాటిని ఓ సారి గుర్తుచేసుకుందాం. ఆరోగ్యంపై కాస్త అవేర్ నెస్ ను పెంచుకుందాం.! 
bhojanam tarvaata ivi cheyakandi.!
తినగానే సిగరేట్ తాగితే సాధారణ సమయంలో తాగే 10 సిగరెట్స్ కు సమానమట.. కాన్సర్ కు కూడా స్కోప్ ఎక్కువట! భోజనం చేసిన వెంటనే ఫ్ర్యూట్స్ తింటే కడుపు మొత్తం గాలితో ఫిల్ అవుతుందంట.. తినడానికి ముందు తిన్న తర్వాత 2 గంటల గ్యాప్ మెయింటెన్ చేస్తూ ఫ్ర్యూట్స్ తినొచ్చట. టీ తాగకూడదు. టీ వలన ఆసిడ్ రిలీజ్ అవ్వడం ఎక్కువై ఆహరం జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. 

తినగానే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిస్తుందంట. అలాగే కంటిన్యూ చేస్తే జీర్ణవ్యవస్థ సామర్థ్యమే తగ్గిపోతోందట. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మరీ నిద్ర తప్పదూ అనుకుంటే 15 నిమిషాల గ్యాప్ తీసుకోండి.

People Like Too Much