ఆ ఊరిలో పగలు ఇంటిలోంచి బయటికి వస్తే ఇక అంతే ?

జిల్‌ దేశంలోని సావో పౌలో రాష్ట్రంలో ‘అరరాస్‌’ అనే గ్రామం ఉంది. అందరికి వెలుగులు పంచే సూరీడే ఈ గ్రామ ప్రజల జీవితాల్లో చీకటి నింపుతున్నాడు. 800 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో 600 మంది భానుడి బాధితులే. సూర్య కిరణాలు పడితే చాలు వారి చర్మమంతా కమిలిపోతుంది. పొక్కులతో భయంకరంగా మారిపోతుంది. 

 
అరరాస్‌ గ్రామ జనాభా 800. అందులో 600 మంది చీకటి పడితే గానీ బయటకు వెళ్లరు. సూరీడు బైబై చెప్తేనే.... వీరు గడప దాటేది. ఈ మధ్యే వచ్చిన తెలుగు సినిమా ‘సూర్య వర్సెస్‌ సూర్య’లో కూడా హీరో నిఖిల్‌ సూర్యుడు ఉన్నంత వరకు బయటకు అడుగుపెట్టడు. నిశాచర జీవిలా... ఎటు వెళ్లాలన్నా.. ఏం చేయలన్నా రాత్రుళ్లే వెళ్తాడు. ఈ గ్రామ ప్రజల తీరు కూడా అలానే ఉన్నప్పటికీ వీరి బాధ వర్ణణాతీతం. సూర్య కిరణాలు వారి శరీరంపై పడితే ఇక అంతే ... చర్మమంతా వికృతంగా అయిపోతుంది. సూర్య కిరణాల్లోని అతి నీలలోహిత కిరణాలు నేరుగా వారి శరీరాలను తాకడం వల్ల వారి చర్మం చికిత్స చేయడానికి కూడా సహకరించని విధంగా మారిపోతుంది. శరీరమంతా దద్దుర్లు వస్తాయి, కళ్లు కూడా డ్యామేజ్‌ అవుతుంటాయి. వీళ్లంతా ‘క్సెరో డెర్మా పిగ్మెంటోసమ్‌‘ అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్‌. ఈ ఊరిని అంతా ‘ఘోస్ట్‌ టౌన్‌’గా పిలుస్తున్నారు.


వీరి సమస్యను పరిష్కరించడానికి ఎంతోమంది వైద్యులు ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. ఎన్నో పరిశోధనల తర్వాత జెనెటిక్‌ బయోలాజిస్ట్‌ డాక్టర్‌ కార్లోస్‌ మెక్‌ ఒక పరిష్కారం కనుగొన్నాడు. అదేంటంటే సూర్యుడు లేని వేళలో బయటకు వెళితే వాళ్లకు ఎలాంటి సమస్య ఉండదు. ఒక వేళ మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు పట్టుకొని వెళ్లవచ్చు. చిన్న పిల్లల నుంచి ముదిమి వయసు వాళ్ల దాకా అందరూ ఇదే అనుసరిస్తున్నారు. గ్రామ ప్రజలకు చీకటే పగలయ్యింది. పగలు చీకటయ్యింది. ఈ వ్యాధికి ప్రస్తుతానికైతే చికిత్స లేదు. కానీ భవిష్యత్తులో దీన్ని నయం చేయగలమని డాక్టర్‌ కార్లోస్‌ తెలిపారు.

మీకు తెలుసా? 
మానవ శరీరం సూర్యరశ్మిని ఉపయోగించుకునే డి విటమిన్‌ను తయారుచేసుకుంటుంది. అయితే ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉండడం వల్ల , వాటిలోని అతి నీలలోహిత కిరణాల వల్ల చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఉంది.


People Like Too Much