భార్య వెడ్డింగ్ రింగ్ నీటిలో పడిందని సముద్రాన్నే కొన్నాడు?

 రష్యాలో ఓ కులీన వంశంలో వింత నమ్మకం ఉండేది. వివాహ సమయంలో తొడిగిన ఉంగరం పోతే శాశ్వితంగా అది తొడిగిన వారు కూడా దూరమైనట్లే నని భావిస్తారు. అందుకే కళ్యాణపు టుంగరాన్ని (వెడ్డింగ్‌ రింగ్‌) ను ఆ వంశజులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. 
sea కోసం చిత్ర ఫలితం
అదే వంశానికి చెందిన ప్రిన్స్‌ యురుస్సోఫ్‌ అనే కులీనుడు పెళ్ళిచేసుకుని తన నూతన వధువుతో కలిసి నల్లసముద్రంపై హనీమూన్‌కి వెళ్ళాడు. నల్ల సముద్రంలో విహరిస్తున్న సమయంలో అతడి భార్య వేలికి ఉన్న వెడ్డింగ్‌ రింగ్‌ సముద్రంలో పడిపోయింది. వెంటనే అతడికి తమ వంశంలో ఉన్న నమ్మకం గుర్తుకొచ్చింది. 

సముద్రంలో పడిపోయిన ఉంగరాన్ని ఎటూ వెదికి పట్టుకోలేడు. కాబట్టి సముద్రాన్నే కొనేస్తే పోలా అనుకున్నాడు. సముద్రాన్ని కొంటే అది తన ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి దానిలో ఉన్న ఉంగరం కూడా తన ఆధీనంలోనే ఉన్నట్టు లెక్క. ఉంగరం పోయిన దోషం అండదు... ఇదీ అతడి ఆలోచన. ఆలోచన వచ్చిందే తడవుగా నల్లసముద్రానికి ఉన్న రెండు కోస్తా తీర ప్రాంతాలపై హక్కులు కలిగిన వందలాదిమంది యజమానులకు డబ్బులిచ్చి తీరంపైన, సముద్రంలో ఉన్న సకల చరాచరా జీవులు, వస్తువులపై హక్కును పొందాడు. మొత్తం మీద నలభై మిలియన్‌ డాలర్లకు నల్ల సముద్రాన్ని కొన్నాడు. 

ఆ ప్రిన్స్‌ చనిపోయిన తరువాత ఇక అతడి వెడ్డింగ్‌ రింగ్‌తో పనిలేదు కాబట్టి అతడి వారసులు నల్ల సముద్రాన్ని రెట్టింపు ధరకు అంటే ఎనభై మిలియన్‌ డాలర్లకు అమ్ముకున్నారు. ఒక నమ్మకం ప్రిన్స్‌ వారసుల జీవితాలనే మార్చివేసింది.

People Like Too Much