శ్రీమంతుడు సినిమా రివ్యూ? చూడకపోతే లావైపోతారు..

ప్రయోగాత్మక చిత్రం 1నేనొక్కడినే నిరాశపరచడంతో అభిమానులు శ్రీమంతుడిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి శ్రీమంతుడు అభిమానులను అలరించాడా??? ఎలా ఉందీ చిత్రం చూద్దామా..
srimanthudu కోసం చిత్ర ఫలితం
కథ
శ్రీమంతుడు కథ మనకోసం ఎన్నో ఇచ్చిన ఊరికోసం ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. మల్టీమిలియనీర్ రవికాంత్ (జగపతి బాబు) కొడుకు హర్ష (మహేష్ బాబు). రవికాంత్ తన కొడుకుకి బిజినెస్ బాధ్యతలు అప్పగిద్దామనుకుంటాడు. కానీ హర్ష తనకు సంతృప్తినిచ్చేదే చేస్తానంటూ, దానికోసం వెదుక్కుంటుంటాడు. అదే టైమ్‌లో చారుశీల (శృతి హాసన్)ని చూసి ప్రేమలో పడతాడు. చారుశీలతో పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. హర్షతన ప్రేమను చెప్పే టైమ్‌కి హర్ష మల్టీమిలియనీర్ రవికాంత్ వారసుడని తెలుస్తుంది. తన సొంత ఊరు ఏదో తెలియని వారికి నేను సరిపడనని చెప్పి హర్ష ప్రేమను తిరస్కరిస్తుంది. ఇక హర్ష తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చారుశీల ఊరు దేవర కోటకి వెళ్తాడు. చారుశీల నాన్న నారాయణరావు(రాజేంద్ర ప్రసాద్)తో కలిసి ఆ ఊరిని డెవలప్ చేసే పనిలో పడతాడు హర్ష.
srimanthudu కోసం చిత్ర ఫలితం
ఇంత జరుగుతుంటే విలన్‌లు లేకపోతే ఎలా ఆ ఊళ్లో కూడా మంచి పనులను అడ్డకోవటానికి విలన్‌లుంటారు. సెంట్రల్ మినిస్టర్ వెంకట రత్నం (ముఖేష్ రుషి), శశి (సంపత్ రాజ్), రాధ (హరీష్)లు హర్షకి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. ఈ విలన్ గ్యాంగ్ వల్ల హర్ష తన వాళ్లకు దూరమవుతాడు. తన కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన రవికాంత్ హర్షని తీసుకొని వెళ్లిపోతాడు. అసలు రవికాంత్‌కి దేవరకోటకి సంబంధం ఏంటి?? అన్నది తెరపై చూడాల్సిందే..

సినిమా ప్రారంభంతోనే ప్రేక్షకులను సినిమాలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు దర్శకుడు కొరటాల. మహేష్ బాబు నటన అద్బుతంగా ఉంది. మహేష్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకుడు అలా చూపించడంలో సఫలమయ్యాడు. ఈ సినిమాకి అదే పెద్ద ప్లస్ పాయింట్. మహేష్ చెప్పినట్టే ఈ సినిమాలో ఇప్పటి వరకు చెయ్యని పాత్ర ఇది అనడంలో సందేహం లేదు. రిచ్ కిడ్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా, ప్రేమికుడిగా, ఓ రెస్పాన్సిబుల్ పర్సన్‌గా మహేష్ నటన అదోరకం అన్నట్టు ఉంది. పాటలు, ఫైట్స్, డ్యాన్స్, ప్రీ క్లెమాక్స్ చాలా బాగున్నాయి. శృతి హాసన్ నటనతో పాటు అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. మహేష్, శృతిల మద్య రొమాంటిక్ ట్రాక్ బాగా పండింది. విలన్ క్యారెక్టర్లను బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇంట్రవెల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పీక్స్.
సినిమా రన్ టైమ్ 163 నిమిషాలుండటం వల్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా సీరియస్‌గా సాగడం వల్ల కామెడీకి చోటు లేదు.
ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన శ్రీమంతుడు. సినిమా ముగిసిన తరువాత తమ తమ ఊరి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బయటకు వస్తారు. శ్రీమంతుడు అన్నీ ఇచ్చాడు చూడకపోతే లావైపోతారు..

People Like Too Much