ఇచ్చట కోళ్ళు అద్దెకు ఇవ్వబడును? మరి కోడి పెట్టిన గుడ్డు పరిస్థితి ?

adde kodi... fri guddu... akkadadante...! akkadadante...!..
అద్దె కోడి.. ఫ్రీ గుడ్డు... ఇదేమిటి? ఫ్రీ గుడ్డు విన్నాం..అద్దెకోడి ఏంటి? ఇదెప్పుడూ వినలేదే.. అనుకుంటున్నారా.. అదేమరి ఈ మధ్యలో ఆ దేశంలో కోడి గుడ్ల ధర ఆకాశాన్ని అంటుతోందట. ఇలా తరుణంలో గుడ్డు తినాలంటే భయమేస్తోందట. దీంతో అక్కడ అద్దె కోళ్ళను పెంచుకుని గుడ్డు తింటుంటారట. ఎక్కడ? కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని పెన్సిల్వేనియాలోని జెన్‌, ఫిల్‌ టాంప్కిన్స్‌ అనే దంపతులు గుడ్డు ప్రేమికుల కోసం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోళ్ళను అద్దెకిస్తే ఎలా ఉంటుందని యోచించారు. 

అనుకున్నదే తడవుగా.. 'కోళ్లు అద్దెకివ్వబడును' అని బోర్డు పెట్టేశారు. రెండు కోళ్లతోపాటు కోళ్ల గూడును కూడా అద్దెకిస్తున్నారు. ఒక కోడి వారానికి 8-14 గుడ్లు పెడుతుంది. నాలుగు నుంచి ఆరు నెలల వరకు అద్దెకిస్తాం. రెంటల్‌ అగ్రిమెంట్‌ పూర్తయిన తర్వాత.. యజమానికి ఇష్టమైతే.. ఆ కోళ్లను కొనుక్కుంటాడు. లేదంటే తిరిగి ఇచ్చేస్తారని జెన్‌ తెలిపారు. 

ప్రాంతాన్ని బట్టి దాదాపు 400 డాలర్లకు అద్దెకిచ్చేవారు. ఈ ఏడాది అద్దెను 600 డాలర్లకు పెంచారు. మొదట్లో అమెరికాలోని 12 రాష్ట్రాల్లో వీరికి 200 మంది కస్టమర్లు మాత్రమే ఉండేవారు. కానీ అమెరికాలో గుడ్ల ధరలు తరచుగా పెరుగుతుండటంతో.. చాలా మంది కోళ్లను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు


People Like Too Much