నిన్న పాలమూరు,నేడు జపాన్ లో గ్రహాంతర వాసులు!


ప్రస్తుతం ఆధునిక ప్రపంచం సాంకేతికంగా ఎంతలా అడుగులు ముందుకు వేసినా కొన్ని జవాబు దొరకని ప్రశ్నలు, సంఘటనలు ఎదురై మనల్ని ఆశ్చర్యంలో, కొంత భయంలో ముంచెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా గతంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో, తాజాగా తెలంగాణాలోని పాలమూరు జిల్లా అచ్చంపేటలో ఆకాశంలో వింత ఆకారాలు కనబడి అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేశాయి.

తాజాగా జపాన్ లోని ఒసాకాలో కూడా తెల్లని పక్షుల్లాంటి ఆకారాలు ఆకాశంలో కనబడడంతో జపనీయులు ఆశ్చర్యపోయారు. సుమారు రెండు నిమిషాల పాటు కనిపించిన ఈ దృశ్యం వీడియోను జపాన్ యూ ట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు. 

ఇవి ఎగిరే పళ్ళాల్లా లేవని, కాకపోతే మరేవై ఉంటాయని వారంతా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ వీటిని కొంతమంది గ్రహాంతర వాసులు అంటూ భయపడుతుంటే, కొంతమంది వీటివల్ల అరిష్టం సోకుతుందేమోనని భయపడుతున్నారు. మరి ఇలాంటి వింత సంఘటనలకు ఎప్పటికి జవాబు దొరుకుతుందో వేచి చూడాలి.




People Like Too Much