ఒక అమ్మ కు వంటి మీద బట్ట కరువు! మరో అమ్మ కు వంటి మీద బట్ట బరువు!!

శ్రీశ్రీ..  ఆధునిక  తెలుగు సాహిత్యయుగాన్ని తన భుజాలపై ఎత్తుకొని పరిగెత్తించిన కవి. విప్లవ కవిగా,  సమాజంలోని అన్ని కోణాలను తన కవితలతో అద్దం పట్టిన మహానుభవుడు అతను. కాంమెట్రీ పోయెట్రీలో ఆయనను మించిన వారుండరంటే అతిశయోక్తి కాదు. పదాలతో సమ్మెట పోటులు వేయగల నేర్పరి, పోయెట్రీతో అనాథల, బీదల థైన్యాన్ని పలికించగల మానవతా వాది.



SRISRI

అటువంటి మహానుభావుడు రాసిన ఒక కవిత : 


ఒక అమ్మ కు వంటి మీద బట్ట కరువు!

మరో అమ్మ కు వంటి మీద బట్ట బరువు!!

ఒకరిది రేషను,! మరోకరిది పేప్షను.!!

ఇద్దరిది వేదనే అంటాడు వేదాంతి!!!

కాదు కాదు అంటాడు రాద్దాంతి!!!!

వారి గ్రహస్తితులు తేడా అంటాడు సిధ్ధాంతి.!!!!

ఇద్దరూ  స్త్రీ లే అంటాడు ఫెమినిస్టు!!!

అన్యాయం జరిగిందంటాడు పోలిటీషను!

ప్రభుత్వం బాద్యత వహించాలంటుంది అపోజీషను!!!!!

నాదృష్టకి రాలేదంటాడు మినిష్టరు!!!

కమీషన్ వేస్తానంటాడు చీఫ్ మినీష్టరు!!!!

బట్ట బరువు అయిన అమ్మ కు ఎంత కష్టమొ అంటాడు కేప్టలిస్టు !!!

బట్ట కరువుకు కారణం శ్రమ దోపిడే. అంటారు మార్కిస్టు!!

ఎదైతే మాకేంటి అంటారు అనార్కీస్టులు!!!

ఇదంతా సాదారణమే అంటూ కోట్టి పడేస్తారు మద్యతరగతి జనం.!!!!



People Like Too Much