అబ్దుల్ కలాంకు మనకు మద్య ఉన్న సంబంధం ఏమిటి?



 మీ మాటలు మీ ప్రసంగాలు ప్రత్యక్షంగా వినకపోయిన మీరు రాసిన పుస్తకాలు చదివాము. ఒక ఋషికి సాధ్యంకాని ఆథ్యాత్మికత అందులో మాకు కనిపించింది..

ఒక రాజకీయనాయకుడు ఎలా ఉండాలో మీరు చెప్పారు..యువతి,యువకుల గురించి మీరు చెప్పిన మాట మేమెప్పుడు మర్చిపోలేము.. (ఇప్పుడు నా ఎదుట ఉన్న యువతీ యువకులు ఎన్నడూ ధైర్యాన్ని,ఉత్సాహన్ని వీడకుందురు గాక.నీ ముందున్న కర్తవ్యాన్ని సాహసంతో దీక్షతో స్వీకరించినప్పుడే విజయం సిద్ధిస్తుంది) నేను ..నాది అని నిత్యం స్వార్ధంలో మునిగి తేలుతున్న మాకు ..మీరు ఇచ్చిన పిలుపు మరిచిపోలేనిది.. (మనిషి తనకు కావల్సిందాన్ని మించి అదికంగా అధికారాన్ని గానీ, సంపదని గానీ పోగు చేసుకున్నాడా అప్పుడతడు తన చేజేతులా వినాశనాన్ని, అశాంతిని, విధ్వంసాన్నీ కోరితెచ్చుకున్నట్టేనని మనం మరువకూడదు). 

మహానుభావా మా కళ్ళతో నీన్ను చూడగలగటం మా అదృష్టం.. మీరు నాటిన విత్తనాలే మా తరానికి మహావృక్షాలు ..మీరు లేని భారతావని ఊహకు అందనిది ..మీ సమస్తాన్ని ప్రజలకోసం,పేదలకోసం ఖర్చుచేసారు,మా కన్నీళ్ళు ఆగటంలేదు.. మీకు మాకు రక్తసంబంధం లేదు కాని అంతకు మించి ఒక భారతీయునిగా మీకు మాకు ఒక మహత్తర సంబంధమే ఉంది,అందుకే మా హృదయాలుఏడుస్తున్నాయ్ 

....కన్నీళ్ళు కారుతున్నా కలం మాత్రం ఆగటంలేదు. కలాంజీ. రియల్లీ వి మిస్ యూ...

People Like Too Much