'రుద్రమదేవి'ని మరో వారం బ్రతకనివ్వరా...

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో శ్రీమతి రాగిణి గుణా సమర్పణలో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి మూవీ 'రుద్రమదేవి'. అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తెలుగు వెర్షన్‌ భారీ ఓపెనింగ్స్‌తోపాటు మొదటి మూడు రోజుల్లోనే 25 కోట్లకు పైగా షేర్‌ సాధించింది. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు 'రుద్రమదేవి' చిత్ర యూనిట్‌ని అభినందించేందుకు తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు, హీరోయిన్‌ అనుష్క, దర్శకుడు గుణశేఖర్‌, చిత్ర సమర్పకురాలు రాగిణి గుణా, సహనిర్మాతల్లో ఒకరైన నీలిమా గుణా పాల్గొన్నారు. 

బ్యూటిఫుల్‌ పెర్‌ఫార్మెన్స్‌. ఎంత క్లిష్టమైన పాత్రంటే మనకు తెలుసు ఆ అమ్మాయి అనుష్క అని. ప్రజలందరికీ మగవాడిగా చూపించాలి. ముఖకవళికల్లో ఏమాత్రం తేడా వచ్చినా దొరికిపోతుంది. అది తెలీకుండా నటించాలి. తను మహిళ అని తెలుసుకున్న తర్వాత లోలోన తను పడే బాధని బాగా చూపించారు. అందుకోసం డైరెక్టర్‌ చాలా తెలివిగా వాయిస్‌ని కూడా బోల్డ్‌ చేశాడు. అనుష్క లేకపోతే ఈ సినిమా తియ్యడం వేస్ట్‌ అనుకునేంత బాగా చేసింది. ఆ అమ్మాయి కోసమే ఈ సినిమా తీశాడు. ఆమె కో-ఆపరేషన్‌తోనే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. 

ఇక గోన గన్నారెడ్డి అల్లు అర్జున్‌ గురించి చెప్పాలంటే సినిమాలో అతనికి నాలుగు ఎంట్రీస్‌ వున్నాయి. ఆ నాలుగు ఎంట్రీస్‌ మామూలుగా లేవు. ఇంట్రడక్షన్‌ అయితే అదిరిపోయింది. ఒక వీరుడికి ఎలాంటి ఇంట్రడక్షన్‌ వుండాలో అలాంటి ఇంట్రడక్షన్‌ ఇచ్చారు. ఈ సినిమాలో నేను యాక్ట్‌ చేస్తాను అని వాలంటరీగా వచ్చి చేశాడంటే హి ఈజ్‌ గ్రేట్‌. హీరోల్లో అది కావాలి. ఇతర పాత్రల్లో నటించిన రానా, ప్రకాష్‌రాజ్‌ కూడా మంచి పెర్‌ఫార్మెన్స్‌ అందించారు. ఇలాంటి మంచి సినిమాకి సంబంధించి నాకు ఒకటే బాధ. పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయినా రెండు, మూడు వారాలు గ్యాప్‌ ఇచ్చి పెట్టిన ఖర్చుకి ఆ సినిమా బ్రతకడానికి ఇండస్ట్రీ ఆలోచన చేయాలి. ఈ సినిమా రిలీజ్‌ అయిన 7 రోజులకే మరో పెద్ద సినిమా వచ్చేస్తోంది. నిజంగా అది బాధనిపిస్తుంది. సినిమా బాగుంది అని స్టాండ్‌ అయ్యే సమయానికి థియేటర్ల కొరత ఏర్పడుతుంది. 
 guna-dasari-anushka
గుంటూరుని తీసుకుంటే 16వ తేదీకి ఏడు థియేటర్లు తీసేస్తున్నారు. మూడు పెద్ద సినిమాలు, మూడు వారాల్లో పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం. ఎవరు బాగుపడడానికి, ఎవరు నాశనం అయిపోవడానికి? ఎందుకీ పోటీ. పెద్ద సినిమాలకు, పెద్ద హీరోల సినిమాలకు పండగలు అక్కర్లేదు. వాళ్ళు ఏ రోజున సినిమా రిలీజ్‌ చేస్తారో ఆరోజే పండగ. పండగల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. అవి చాతగాని ఎకనామిక్స్‌. రెండు వారాలు గ్యాప్‌ ఇచ్చుకుంటూ వెళ్తే అన్ని సినిమాలు బ్రతుకుతాయి. ఈ సినిమాకి వేరే సినిమా లేకుండా వారం రోజులు గ్యాప్‌ వచ్చి వుంటే మాత్రం 'రుద్రమదేవి' చరిత్ర సృష్టిస్తుంది

People Like Too Much