కడపలో నేను ఆ పని చేస్తా...అనుమతివ్వండి నాన్నగారూ ...

ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను దేనికదే అభివృద్ధిలో తేడా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు కృషి చేస్తున్నారు. మరోవైపు యువ నాయకుడు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన కార్యచరణకు సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనా నారా లోకేష్ ప్రత్యేకంగా కరవు సీమగా పేరొందిన రాయలసీమపై దృష్టి సారించినట్లు చెపుతున్నారు. 
lokesh
ఇక్కడ ఉపాధి అవకాశాలు సాధించుకుంటే సీమ నాలుగు జిల్లాల ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లే గతి పట్టదనీ, ప్రజలకు ఉపాధినిచ్చే భారీ పరిశ్రమలకు కృషి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేష్ తొలుత కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని కృషి చేస్తున్నారట. వైఎస్ హయాంలో ఫ్యాక్టరీ నిర్మించేందుకు 10 వేల ఎకరాలు కేటాయించినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 

ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతో కాకుండా ప్రభుత్వరంగ సంస్థలతోనే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయసహకారాలు కూడా కావాలని కోరినట్లు చెపుతున్నారు.

People Like Too Much