కూతురి ఎద సంపద చూసి.. రేప్ చేస్తారని భయపడి దాన్ని ఐరన్ బాక్స్ తో అనిచేస్తున్న తల్లులు ... ఎక్కడ ?

అత్యాచారం అనేది ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్న మాటే. కామాంధులు అదను చూసి యువతులు, బాలికలపై అత్యాచారం చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా బయటకు వస్తూనే ఉన్నాయి. వీటిని అదుపుచేసేందుకు భారతదేశంలో నిర్భయ చట్టం తెచ్చినా నేరాలు మాత్రం అదుపులోకి రావడంలేదు. ఈ నేపధ్యంలో మహిళల రక్షణ కోసం భారతదేశం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 
  ఐతే కేమరూన్, నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తమ అమ్మాయిలను రక్షించుకునేందుకు తల్లులు క్రూరమైన పద్ధతిని అవలంభిస్తున్నారు. బాలిక పుష్పావతి కాగానే ఆమె వక్షోజాలను ఇస్త్రీ పెట్టెతో ఐరన్ చేసి అదిమేస్తున్నారు. ఎద సంపద మగాళ్లను ఆకర్షించి అత్యాచారాలకు పాల్పడుతారన్న ఉద్దేశ్యంతో వారు ఆ కిరాతకానికి పాల్పడుతున్నారు. ఐరన్ చేసే పద్ధతిలో అమ్మాయిలు విలవిలలాడిపోతారు. కొంతమంది తల్లులు తమ బిడ్డలు ఇలా బాధ పడకుండా కొద్ది బాధతో ఉండేలా వేరే పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 

బలమైన రాయి, సుత్తి, గరిటె వంటి వస్తువులను నిప్పుల్లో ఎర్రగా కాల్చి వక్షోజాలను కాల్చేస్తున్నారు. అవి పెరగడం వల్ల అమ్మాయి రక్షణకు ఇబ్బంది కలుగుతుందని ఇలాంటి దారుణానికి ఒడికడుతున్నారు. ఇక ధనికులైతే తమ ఆడ పిల్లల ఎద సంపద కాస్త ఎదుగుతున్నట్లు కనిపించగానే వెంటనే ఆమె ఛాతికి బలమైన ప్లాస్టిక్ బెల్టులను బిగించి అవి పెరగకుండా చూస్తున్నారు. ఇలా బ్రెస్ట్ ఐరనింగ్ బారిన పడుతున్నవారి సంఖ్య దాదాపు 3.8 మిలియన్లుగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమిత గణాంకాలు చెపుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు పైన పేర్కొన్న మూడు దేశాల్లోనూ ఎలాంటి చట్టాలు లేవు. ఇవి ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్నాయి. బ్రెస్ట్ ఐరనింగ్ కారణంగా పెళ్లయ్యాక తల్లులయ్యే యువతుల్లో పిల్లలకు పాలివ్వడం దుర్లభంగా మారుతోంది. చాలామందిలో బ్రెస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చి నరకాన్ని చవిచూస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏమంటే... ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నది వారి తల్లులే కావడం. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు లండన్‌లోని 'చారిటీ విమెన్స్ అండ్ గర్ల్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి వారి మాటలు ఎంతమేరకు పట్టించుకుని ఈ అకృత్యాలను ఆపుతారో చూడాలి.

Related :
మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

ఆ స్వామీజీ చెపారు... మొగుడ్ని దగ్గరకు రానివ్వద్దని...ఎందుకంటే ?

సమంతా డ్రెస్ మార్చుకునే అప్పుడు ఫొటోస్ తీసి నెట్ లో పెట్టారు

ఫంక్షన్ లో డ్రస్సు జారిపోయి ఆ కుర్ర హీరోయిన్ కష్టా...

ఆ హీరొయిన్ బొడ్డు బాలేదని గ్రాఫిక్స్ తో సరి చేసిన ...

People Like Too Much